Thaman: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన పాటలకు.. ముఖ్యంగా మాస్, యాక్షన్ సినిమాలకు అందించే ఎనర్జిటిక్ ట్యూన్స్‌కు ప్రసిద్ధి. యూత్‌ను ఆకట్టుకునేలా క్యాచీ బీట్స్‌ను అందించడంలో దిట్ట. ఇంకా చెప్పాలంటే.. యాక్షన్ సీక్వెన్స్‌లకు, హై వోల్టేజ్ సన్నివేశాలకు థమన్ అందించే నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్నిస్తుంది. ‘అఖండ’ సినిమాకు ఇచ్చిన బీజీఎం చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న.. ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల్లో థమన్ టాప్‌లో ఉన్నాడు. ట్రెండ్‌ను సెట్ చేస్తూ.. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ట్రెండీ సంగీతాన్ని అందిస్తూ దుమ్ముదులుపుతున్నాడు. కాసేపు ఇవన్నీ అటుంచితే.. మ్యూజిక్ అంటే ఎంతో పిచ్చో.. క్రికెట్ అంటే అంతకుమించి పిచ్చి. సెలబ్రిటీ లీగ్ జరిగినప్పుడు క్రికెట్ (Cricket) కూడా ఆడుతుంటాడు. ఇక ఏ మ్యాచ్ కూడా చూడకుండా వదలడు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్ జరుగుతోందంటే చూడకుండా అస్సలు వదలడు. అయితే ఇదే క్రికెట్ విషయంలో థమన్ పప్పులో కాలేశాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
Read Also- Chandrababu: ‘సమరం’ చీకటి రోజులు గుర్తు చేసిన సీబీఎన్
ఆ మాత్రం తెలియదా?
నిన్న రాత్రి థమన్ సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. దీనికి ‘డోన్ట్ బౌల్ షార్ట్ బ్రో’ అని నవ్వుతూ ఎమోజీలను జతచేశాడు. ఆ వీడియోలో ఉన్నది, బ్యాటింగ్ ఆడింది.. సిక్స్ కొట్టింది కూడా థమన్ కావడం విశేషం. అయితే ఎంతో హ్యాపీగా ఫీలవుతూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. బహుశా ఆయన ఉద్దేశం.. షార్ట్ బాల్స్ సరిగ్గా వేయకపోతే బ్యాట్స్‌మెన్‌కి మంచి అవకాశం ఇచ్చినట్లే! అని ఉండొచ్చు కానీ, జనాలకు.. నెటిజన్లు, విమర్శకులకు మాత్రం మరోలా అర్థమైంది. ‘షార్ట్‌కి స్లాట్‌కి తేడా తెలియనప్పుడే అర్థమైంది నువ్వు దోనీ ఫ్యాన్ అని’ అని జతిన్ రెడ్డి అనే నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో థమన్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే రిప్లయ్ ఇచ్చిపడేశాడు. అడ్రస్ పెట్టు.. అడ్రస్.. అడ్రస్ పెట్టు అనే డైలాగ్ ఈ మధ్య బాగా వినిపిస్తోంది.. వినే ఉంటారు కూడా. ఇదే డైలాగ్‌ను ఇంకోలా కొట్టాడు థమన్. ‘ ఓకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పెట్టు బే..’ అంటూ గట్టిగా ఇచ్చి పడేశాడు. ఇందుకు మళ్లీ జతిన్ రిప్లయ్ ఇచ్చాడు. దోనీ ఫామ్ హౌజ్ అడ్రస్ ఇదిగో అంటూ.. ‘ రాంచీ రింగ్ రోడ్డు, జార్ఖండ్- 834005 ఇక్కడికి వచ్చేయ్ అన్న మనకు ఒక కీపర్ కూడా ఉన్నాడు ఆడుకుందాం’ అని ఫన్నీగా రిప్లయ్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు.
Read Also- Kayadu Lohar: ‘పిక్కలు చూశావా.. భయ్యా’.. డైలాగ్ చెప్పకుండా ఉండగలరేమో ట్రై చేయండి!
వామ్మో.. ఇంత వైలెంటా!
ప్రస్తుతం థమన్ వీడియో.. నెటిజన్ కామెంట్.. రిప్లయ్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత జరిగిన తర్వాత మీమ్స్, మీమర్స్ ఎందుకు ఖాళీగా ఉంటారు చెప్పండి.. ఓ ఆటాడుకుంటున్నారు. వాస్తవానికి థమన్ ఎప్పుడూ ఇంత సీరియస్‌గా ఉండడు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్స్ చేస్తే అస్సలు రిప్లయ్ ఇవ్వడు. అలాంటిది దోనీని హేళన చేస్తూ మాట్లాడటం, ఆ మాత్రం తెలియదా? అనేసరికి ఒక్కసారిగా ఈ రేంజిలో ఫైర్ అయ్యాడు. దీంతో థమన్ ఏంట్రా బాబోయ్.. ఇంత వైలెంట్‌గా ఉన్నాడని అభిమానులు ఒకింత కంగుతిన్నారు. ఆ తర్వాత కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ‘క్రికెట్‌లోనే కాదు.. ఓజీతో సిక్సర్ కొట్టు’ అంటూ సరదాగా రిప్లయ్‌లు ఇచ్చారు. థమన్ ప్రస్తుతం.. నందమూరి బాలయ్య అఖండ-2, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’కి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also- YSRCP: సీన్ రివర్స్.. టీడీపీ నుంచి వైసీపీలోకి కీలక నేత
Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7
— thaman S (@MusicThaman) June 25, 2025