Pawan and Manchu Vishnu
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Movie: పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ‘కన్నప్ప’కు ఎంత లాభమో! ఇప్పటికైనా తెలిసిందా?

Kannappa Movie: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తీసుకున్న నిర్ణయంతో ‘కన్నప్ప’కు లాభం చేకూరడమేంటి? ఒక్క మంచు మనోజ్ (Manchu Manoj) మినహా.. మిగతా ఇద్దరు మంచు హీరోలు, మెగా హీరోలంటే శత్రువులను చూసినట్లు చూస్తారు. ‘మా’ ఎన్నికల సమయంలో అది నిరూపితమైంది కూడా. పైగా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా.. వారి మధ్య విభేదాల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ, శత్రువైనా సరే మంచిని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే కచ్చితంగా అది పవన్ కళ్యాణే. ఆయన తీసుకున్న నిర్ణయాలు మొదట కాస్త కఠినంగా అనిపించినా, ఆ తర్వాత ఎంత లాభం ఉంటుందో.. ఇప్పుడు ఇండస్ట్రీకి తెలిసి వస్తుంది.

రీసెంట్‌గా ఆయన సినిమాపై కుట్ర పన్ని, విడుదల సమయంలో థియేటర్ల బంద్ అంటూ షో చేసే ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాయడం, ఆ లేఖలో ఇకపై ఎవరూ టికెట్ల ధరలు పెంచుకునే నిమిత్తం తనని కలవవద్దని ప్రకటించారు. ఏదైనా సరే.. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే జరగాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆఖరికి ఆర్. నారాయణ మూర్తి కూడా పవన్ కళ్యాణ్‌ పద్దతి ఏం బాగా లేదంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే, ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి దరఖాస్తు వెళ్లినా, వెంటనే పనైపోతుంది. చిన్న, మీడియం, పెద్ద అనే తేడాలు లేకుండా ఫిల్మ్ ఛాంబర్ నుంచి దరఖాస్తు వెళితే చాలు, ఏపీ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది. ఈ ఆలోచన మాత్రం పవన్ కళ్యాణ్‌దే అని అంతా ఒప్పుకుని తీరాల్సిందే.

Also Read- Kayadu Lohar: ‘పిక్కలు చూశావా.. భయ్యా’.. డైలాగ్ చెప్పకుండా ఉండగలరేమో ట్రై చేయండి!

ఈ నిర్ణయమే ఇప్పుడు ‘కన్నప్ప’ (Kannappa)కు లాభం చేకూర్చుతుంది. మాములుగా అయితే టికెట్ల ధరలు పెంచమని అడగడానికి ఏపీ ప్రభుత్వ పెద్దల్ని ‘కన్నప్ప’ టీమ్ కలవాలి. కానీ, మొన్న పవన్ కళ్యాణ్ చేసిన దిశా నిర్దేశంతో మంచు విష్ణు (Manchu Vishnu) ఫిల్మ్ చాంబర్ ద్వారానే తన సినిమా టికెట్ల ధరలు పెంచుకోగలిగాడు. నిజంగా ఇది వినడానికి ఎంతో గౌరవంగా ఉంది కదా. ఇదే కదా పవన్ కళ్యాణ్ కోరుకుంది. తన, మన అనే భేదం లేకుండా అందరికీ, ఆఖరికి రేపు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల అవుతున్నా, ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే టికెట్ల ధరలకు సంబంధించి దరఖాస్తు వెళ్లాలి. అది పవన్ కళ్యాణ్‌కి కూడా ముందు చూపు. అలా వెళ్తే, ఆ దరఖాస్తుకి కూడా ఒక విలువ ఉంటుంది. వ్యక్తిగతంగా కాకుండా, ఒక ఇండస్ట్రీ తరపున దరఖాస్తు వచ్చిందని, వెంటనే పరిశీలనలోకి వెళ్లి పని జరుగుతుంది. దీని కోసం మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు.

Also Read- Naga Chaitanya: అప్పుడు సమంతతో.. ఇప్పుడు శోభితతో.. హిట్ కాంబో రిపీట్?

ఇప్పుడు ‘కన్నప్ప’ టీమ్‌ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పంపిన దరఖాస్తుతో ఏపీలో ఈ సినిమాకు ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50 రూపాయల వరకు పెంపునకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హయ్యర్ క్లాస్ టికెట్స్‌కు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. సినిమా విడుదలైన 10 రోజుల వరకు ఈ పెంపు వర్తిస్తుంది. జూన్ 27, శుక్రవారం ‘కన్నప్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

AP Govt Go for Kannappa

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు