Local Body elections (imagcredit:twitter)
తెలంగాణ

Local Body elections: స్థానిక సంస్థల ఎన్నికలపై.. కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు

Local Body elections: స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు జరపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవి(Justice Madhavi devi) పేర్కొన్నారు. ముప్పయి రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు 2024, జనవరి 31వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆరు నెలలోపు ఎన్నికలు నిర్వహించాలి. అయితే, వేర్వేరు కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవటాన్ని సవాల్ చేస్తూ కొందరు మాజీ సర్పంచులు హైకోర్టులో(High Cort) ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించిందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ(Constitution), పంచాయతీ రాజ్​చట్టాలకు విరుద్ధమని తెలిపారు. ప్రత్యేక అధికారులకు ఇతర విధులు ఉన్న నేపథ్యంలో ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని తెలిపారు.

పాత సర్పంచులను కొనసాగించాలా

రాష్ట్ర ఆర్థిక సంఘం(State Finance Commission) ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అప్పులు చేసి అభివృద్ధి పనులను పూర్తి చేశారన్నారు. ఎన్నికలు జరపక పోవటం వల్ల వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావటం లేదని తెలియచేశారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని, లేనిపక్షంలో పాత సర్పంచులను కొనసాగించాలన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్​ఖాన్(Imran Khan)​సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బీసీ(BC Reservation) రిజర్వేషన్ల ఖరారు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని చెప్పారు.

Also Read: Rowdy-Sheeters: హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్ల పేర దండిగా వసూల్లు!

దీనిని పూర్తి చేయటానికి మరో నెల రోజుల వ్యవధి కావాలని కోరారు. ఎన్నికల సంఘం(Election Commission) తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ విద్యాసాగర్ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘానికి రెండు నెలల సమయం అవసరమవుతుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు వార్డుల విభజన, రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి ముప్పయి రోజులు, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయటానికి ఎన్నికల సంఘానికి అరవై రోజుల గడువునిస్తూ సెప్టెంబర్ 3‌‌0వ తేదీని డెడ్​లైన్​గా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అమలు ఎలా?

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీలోపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. అయితే, బీసీ(BC)లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రస్తుతం సర్కార్కు సవాల్​గా మారింది. దీనికి కారణం రిజర్వేషన్ల బిల్లు(Reservation Bill) కేంద్రం వద్ద పెండింగులో ఉండటమే. నిజానికి రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ ఇప్పటికే రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించింది. గవర్నర్(Governar) వీటికి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించారు. అయితే, ఈ బిల్లులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం(Central Govt) వద్ద పెండింగులో ఉన్నాయి. కాగా, కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration)​ కు కట్టుబడి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని పలుమార్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.

ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన గడువులోపు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. కేంద్రం నుంచి ఆమోదం రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేసి బీజేపీని ఇరుకున పెట్టవచ్చన్నది కూడా కాంగ్రెస్(Congrss)​ వ్యూహంగా కనిపిస్తోంది.

Also Read: Bhatti vikramarka: కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?