Kayadu Lohar: ‘‘ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు’’ అనే డైలాగ్ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఉంటుంది. ఈ డైలాగ్‌లో ఎంత డెప్త్ ఉంటేనో త్రివిక్రమ్ రాయగలడు. దీనినే మనవాళ్లు ఓడలు బళ్లవడం, బళ్లు ఓడలవడం అని కూడా అంటుంటారు. అంటే ఎప్పుడూ ఒక్కడిదే ఇక్కడ రాజ్యం ఉండదు. ఎప్పుడూ ఒకటే ట్రెండ్ నడవదు. ఇప్పుడు పడిన వాడు రేపు పరుగెత్తగలడు. ఇప్పుడు జీరో అయినవాడు రేపు హీరో అవగలడు. ఏమో చెప్పలేం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉన్నా, దానిలో ప్రయాణించే ప్రతీది మారుతూనే ఉంటుంది. ఇక్కడెవరూ శాశ్వతం కాదు.. అంతా కొన్నాళ్ల పాటు భూమి మీద ఉండిపోవడానికి వచ్చిన వాళ్లే. ఇప్పుడిదంతా ఎందుకని అనుకుంటున్నారా? ట్రెండ్‌ని షేక్ చేస్తున్న కయదు లోహర్ గురించి చెప్పడానికే ఇదంతా.
Also Read- Kannappa: ‘కన్నప్ప’కు పోటీగా మరో శివుడి సినిమా.. ఇలా షాకిచ్చారేంటి?
అవును, తెలుగు ప్రేక్షకులకు శ్రీ విష్ణు సరసన నటించిన ‘అల్లూరి’ (Alluri Movie) చిత్రంతోనే ఆమె పరిచయమైనా, అప్పుడంతగా ఆమె ఎవరి కంట్లో పడలేదు. ఆ సినిమా ఏమైనా హిట్టై ఉంటే.. కాస్త దృష్టిలో పడేదేమో కానీ, ఆ సినిమా ఘోర పరాజయం చెందడంతో కయదుకు కనీస గుర్తింపు దక్కలేదు. కొంత గ్యాప్ తర్వాత కొత్తందాలతో ఆమె ‘డ్రాగన్’ (Dragon) రూపంలో ఎంట్రీ ఇచ్చి.. కుర్రకారును కుదేల్ చేసింది. అబ్బ.. ఏమందం? అంటూ అంతా ఈ భామ గురించే చర్చించుకుంటున్నారంటే, ప్రస్తుతం ఆమె ట్రెండ్‌ని ఏ విధంగా షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంది, ఇప్పుడామె ట్రెండ్ నడుస్తుందని. వాస్తవానికి ‘అల్లూరి’ సినిమాలోనూ తన పరువాలను ఎక్స్‌పోజ్ చేసింది. కానీ అంతగా, అవి ఎవరికీ ఎక్కలేదు. కానీ ‘డ్రాగన్’కి వచ్చే సరికి.. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళీ కుర్రాళ్లకు కూడా కలల సుందరిగా మారిపోయింది.
Also Read- Tejaswi Madivada: నేనింకా ఉన్నాను.. వాడు ఏమైపోయాడో? కౌశల్‌ని ఇలా అనేసిందేంటి?
ఆమెకు సంబంధించి ఏ చిన్న ఫొటో, వీడియో.. సోషల్ మీడియాలో దర్శనమిచ్చినా వైరల్ అవుతూ, ఆమె పేరును ట్రెండింగ్‌లోకి తెచ్చేస్తున్నాయి. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు.. తమ సినిమాలలో హీరోయిన్‌గా ఆమెనే కావాలని కోరుకుంటున్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్ సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ వచ్చిందనేలా టాక్ నడిచింది. ఇలా స్టార్ హీరోలు కూడా ఆమె కావాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారంటే.. ఎంతగా ఆమె అందాలకు పదును పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూస్తే మాత్రం.. కచ్చితంగా ‘ఖలేజా’ డైలాగ్ చెప్పకుండా ఉండలేరు. ‘పిట్ట పిట పిట లాడుతుంది’ అని సోగ్గాడే చిన్ననాయన డైలాగ్, ‘దాని పిక్కలు చూశావా భయ్యా?’ అని ఖలేజా డైలాగ్.. ఇలా ఆ వీడియోను చూసిన వారంతా కామెంట్స్‌తో కుమ్మేస్తున్నారు. మీరూ ఈ వీడియో చూసి.. ఆ డైలాగ్ చెప్పకుండా ఉండగలరేమో ట్రై చేయండి..
30 லச்சத்துக்கு ஒர்த்தான .. ஹீரோயின் என்பேன் நான் .. pic.twitter.com/QUX496ibHP
— வேடன் Dr.எட்டு (@8tttuu) June 22, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు