Kannappa vs Chandreshwara
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: ‘కన్నప్ప’కు పోటీగా మరో శివుడి సినిమా.. ఇలా షాకిచ్చారేంటి?

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకు పోటీగా మరో శివుడి సినిమా విడుదల కాబోతోంది. అసలే విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాకు పోటీగా ఇంకో శివుడి సినిమా అంటే, ఇది ‘కన్నప్ప’ టీమ్‌కు షాకిచ్చే విషయమే అని భావించాలి. జూన్ 27న రెండు శివుడి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ‘కన్నప్ప’కు సంబంధించి గతం వారం పది రోజులుగా వింటూనే ఉన్నాం.. ఇక ఆ రెండో సినిమా విషయానికి వస్తే.. ‘కన్నప్ప’తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో.. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించారు. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

Also Read- Dokka Seethamma: ‘డొక్కా సీతమ్మ’ గురించి ఈ విషయం తెలుసా?

ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ రెండు సినిమాలు సక్సెస్ కావాలని కోరారు. ‘‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు ‘చంద్రేశ్వర’ మూవీతో నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలు ఇందులో ఆకట్టుకునేలా చూపించాం. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పగలం. ఈ సినిమాకు సంగీతం ప్రధాన హైలెట్‌గా ఉంటుంది. ఇందులో సాంగ్స్ అన్నీ అత్యద్భుతంగా వచ్చాయి. ‘ఈశ్వరా.. నా పరమేశ్వరా’, ‘అఖిల అఖిల’ డ్యూయెట్ సాంగ్, ‘నమస్తే చిదంబరం’ అనే సాంగ్.. ఇలా సాంగ్స్ అన్నీ వండర్‌ఫుల్‌గా వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండ్ అవుతున్నాయి.

Also Read- Kannappa: ‘కన్నప్ప’కు సెన్సార్ షాక్.. 13 నిమిషాల సినిమా లేపేశారు.. ఫైనల్ నిడివి ఎంతంటే?

సినిమా సస్పెన్స్‌, హారర్ అంశాలతో అత్యద్భుతంగా వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా, ప్రేక్షకులను కన్నార్పకుండా చూసేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలతకు ఇందులో తావుండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?