Tamannaah – Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో స్టార్ నటి తమన్న ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. సౌత్ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న తమన్నాతో డేటింగ్ చేయడం ద్వారా.. నటుడు విజయ్ దక్షిణాది పరిశ్రమలో బాగా పాపులర్ అయ్యారు. తమన్నతో డేటింగ్ కు ముందు అతడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెతో రిలేషన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బాలీవుడ్ (Bollywood) తో పాటు సౌత్ మీడియాలోనూ విజయ్ వర్మకు అటెన్షన్ వచ్చింది. అయితే 2, 3 ఏళ్ల రిలేషన్ తర్వాత తమన్నా – విజయ్ వర్మ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన మరో హీరోయిన్ తో ప్రేమలు పడినట్లు బీ టౌన్ లో చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh)తో.. విజయ్ వర్మ డేటింగ్ ఉన్నట్లు ఒక్కసారిగా పుకార్లు మెుదలయ్యాయి. దంగల్ మూవీతో ఫాతిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వారిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు బాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. విజయ్ – ఫాతిమా ఇటీవల ఓ కేఫ్ లో జంటగా కనిపించి అనుమానాలకు తావిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారన్న రూమర్లు సైతం నెట్టింట వినిపిస్తున్నాయి. దీనిపై విజయ్ – ఫాతిమా జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also Read: Akhil Akkineni: అఖిల్ కి అలాంటి గండం ఉందా.. లెనిన్ నుంచి మళ్లీ హీరోయిన్ ఔట్?
మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా ‘గుస్తాఖ్ ఇష్క్’ (Gustakh Ishq) అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్న పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఫాతిమా.. నటుడు విజయ్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విజయ్ ఒక మంచి నటుడు. అద్భుతమైన వ్యక్తి. ప్రతిభతో ముందుకు సాగుతాడు. కొంత సమయం తీసుకున్నప్పటికీ అలాంటి వారు తాము అనుకున్న స్థాయికి చేరుకుంటారు’ అని ఫాతిమా చెప్పుకొచ్చింది.