TG Govt Schools: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమం ఈ ఏడాది మంచి విజయాలను సాధించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 24వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2,56,156 మంది విద్యార్థులు చేరారు.
Also Read: Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!
గత ఏడాది ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా 2,00,901 మంది విద్యార్థులు చేరగా, ఈ ఏడాది ఏకంగా 55,255 మంది విద్యార్థులు అదనంగా జాయిన్ అయ్యారు. ఈ ఏడాది 1వ తరగతిలోనే 1,07,126 మంది విద్యార్థులు చేరగా, అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 5,811 మంది విద్యార్థులు నమోదయ్యారు. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,48,97 మంది విద్యార్థులు చేరినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 19,555 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా చేరారు. ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని, ప్రభుత్వ విద్యా సంస్కరణల విజయానికి నిదర్శనమని విద్యా శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.