Renu Desai:తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్ మనందరికీ సుపరిచితమే. అయితే, ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటించకపోయినా సోషల్ సర్వీస్ తో అందరి మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా చిన్న పిల్లల కోసం తన వంతు సాయం చేస్తుంది. అంతే కాదు, మూగ జీవాల సంరక్షణ కోసం కూడా ఎంతో కృషి చేస్తోంది.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. రేణూ దేశాయ్ సొసైటీలో జరుగుతోన్న కొన్ని సంఘటనలపై తన మద్దతు తెలుపుతుంటుంది. సోషల్ మీడియాలో జంతువుల గురించి ఎన్నో వీడియోలు ఫ్యాన్స్ కు షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా, ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దయచేసి నాకు సహాయం సాయం చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. అసలు, ఆమె ఎందుకు ఇలా పెట్టిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్
ఆమె తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఇలా పోస్ట్ చేసింది. ” విజయవాడలో ఉంటున్న ప్రజలారా.. ప్రతి ఒక్కరూ దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి. రవి గారికి ఎంతో కొంతో డొనేట్ చేయండి. మీరు నా ఎన్జీవో కి ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి జంతు సంఘానికి డొనేట్ ఇవ్వండి” అంటూ దండం ఎమోజిని యాడ్ చేసి రాసుకొచ్చింది. ప్రస్తుతం, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతక ముందు కూడా ఆమె ఇలా జంతువుల సంరక్షణ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది.