Anjanadevi Health
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Anjana Devi: తల్లి అంజనా దేవికి అనారోగ్యం.. హుటాహుటిన వెళ్లిన పవన్

Anjana Devi: ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meet) కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కీలకమైన ఈ భేటీకి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెంటనే వెళ్లిపోయారు. తన తల్లి అంజనా దేవికి అనారోగ్యానికి గురయ్యారనే సమాచారం అందిన వెంటనే ఆయన వెనుతిరిగారని తెలుస్తోంది. అంజనా దేవి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌కు తరలించినట్టు సమాచారం. తల్లి ఆరోగ్యం బాలేదని తెలియడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన ఆయన హైదరాబాద్‌ బయలుదేరారు.ఈ అప్‌డేట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా, అంజనాదేవీ గతంలో కూడా పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. ఈసారి కూడా త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, అంజనా దేవి ఆరోగ్యంపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Read this- Team India: 93 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. టీమిండియా సంచలన రికార్డు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..