Tollywood: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. సినిమా షూట్స్, ఆయన వ్యక్తిగత జీవిత విషయాలు గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అలాంటి శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన వీడియో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తన ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంటాడు. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆయన తన జీవితంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
Also Read: Dil Raju on Game changer: వాళ్లను నమ్మడం నాదే తప్పు.. గేమ్ ఛేంజర్ పై దిల్ రాజు సంచలన కామెంట్స్
శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘‘ అందరికీ నమస్తే.. మీ అందరికీ ఓ గొప్ప శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మీ అందరి కోసం ఒక సూపర్ న్యూస్ .. మైండ్ బ్లోయింగ్ వార్త ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను. మరో నాలుగు నెలలు పాటు నేను సోషల్ మీడియాలో కనిపించను. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ కూడా వాడను. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. గుడ్ బై ’ అంటూ ఒక వీడియోను విడుదల చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో ఎన్నో చర్చలకు దారి తీస్తుంది. ఇన్ని రోజులు మంచిగా ఉన్న శ్రీకాంత్ కు ఏమైంది? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఏమైనా జరిగి ఉంటుందా? లేక ఎవరైనా కావాలని అతనితో ఇలా చేయించారా? అని ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్‌గా ఉండే శ్రీకాంత్‌కు ఏమైంది? ఇలా ఎందుకు చేశాడంటూ నెటిజన్లు కూడా వందల కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్
మరి, దీని మీద ఇంకో వీడియో రిలీజ్ చేస్తాడా లేక తను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాడా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
