BJp vs BRS: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్‌ఎస్ నాయకులు కేంద్ర మంత్రి (Bandi Sanjay) బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు. (Bandi Sanjay) బండి సంజయ్‌కి మద్దతుగా నిలుస్తూ కమలదళం అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేసింది.
కాళేశ్వరం అవినీతి ముమ్మాటికీ వాస్తవం..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది “ముమ్మాటికీ వాస్తవం” అని, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే కాళేశ్వరం దోషులకు శిక్ష సాధ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) వాస్తవాలు మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్ (BRS) నేతలు తట్టుకోలేకపోతున్నారని, కేసీఆర్ కుటుంబ అవినీతి బద్దలయ్యే సమయమొచ్చిందని పాయల్ శంకర్ (Payal Shankar) ఫైరయ్యారు. సొంత కుటుంబంలోనే వాటాల పంపకాలపై గొడవలు ముదిరాయని, చేసిన తప్పులకు కేసీఆర్ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
Also Read: Phone Tapping Case: ప్రభాకర్ రావు ఎవరి కనుసన్నల్లో పనిచేసినట్టు!
ఉట్ల చోర్ కోత్వాల్ డాంటే..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ అంశంపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై బండి సంజయ్ (Bandi Sanjay) ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్‌ఎస్ (BRS) నాయకులు “అవాకులు చవాకులు పేలుతున్నారని” ధ్వజమెత్తారు. బండిపై బీఆర్‌ఎస్ (BRS) నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించారు. కాళేశ్వరం అవినీతిపై ప్రధాని మోదీ స్టాండే తమ స్టాండ్ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ (BRS) నేతల వైఖరి చూస్తుంటే “ఉట్లా చోర్ కోత్వాల్ డాంటే” అన్నట్లుగా ఉందని చురకలంటించారు.
బీఆర్‌ఎస్ నేతలు మేధావులా?..
కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ (BRS) నేతల వ్యాఖ్యలు “దెయ్యాలు వేదాలు వల్లించినట్లే” ఉందని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ విమర్శలు చేశారు. తుమ్మడిహట్టి వద్ద 165 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) సైతం నివేదిక ఇచ్చిందని అన్నారు. ఇరిగేషన్ నిపుణుల కంటే బీఆర్‌ఎస్ (BRS) నేతలు మేధావులా అని పాల్వాయి ప్రశ్నించారు. ఏసీబీ పట్టుకుంటే కాళేశ్వరం ఈఈ వద్ద రూ. 200 కోట్లు, ఈఎన్సీ వద్ద రూ. 500 కోట్ల ఆస్తులు బయటపడ్డాయని గుర్తుచేశారు. ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఎంత దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబం ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా ధనం దోపిడీ..
ముథోల్ ఎమ్మెల్యే రామా రావు పటేల్ సైతం ఈ అంశంపై స్పందించారు. ప్రజా ధనం దోపిడీ చేసిన వాడు ఎంత ద్రోహి అవుతాడో, వారిని సమర్థించే వాడు సైతం అంతే బాధ్యత వహిస్తాడని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ (KCR) కుటుంబాన్ని కాపాడాలని చూసే బీఆర్‌ఎస్నా (BRS)యకులంతా తెలంగాణ ద్రోహులేనని ఆయన వెల్లడించారు. బండిపై మాట్లాడే అర్హత ఈ దొంగలకు లేదన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar) తెలంగాణ ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు తీసుకుని వేల కోట్లు దోచుకున్నాడన్నారు.
ఇప్పుడు వినోద్ కుమార్ (Vinod Kumar) ఏమీ ఎరగనట్లుగా సుద్దపూసలా బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలని సూక్తులు చెబుతున్నాడని చురకలంటించారు. వాన నీళ్లకు నిండిన చెరువుల వద్ద పూలు చల్లి కాళేశ్వరం నీళ్లని చెప్పి జనాల్ని మోసం చేసిన “నీచులు” బీఆర్‌ఎస్ నేతలు అని విమర్శలు చేశారు. ఎవరెంత రక్షించాలని చూసినా లిక్కర్ స్కాంలో కవిత జైలుకు పోయిందని, ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్ కూడా పోతాడని, కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ (KCR) కూడా జైలుకు వెళ్లక తప్పదని రామారావు పటేల్ స్పష్టంచేశారు.
సీడబ్ల్యూసీనే తప్పుడబతారా?..
బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం తప్పిదాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తితే తప్పేంటని ప్రశ్నించారు. (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ఎందుకు కప్పిపుచ్చుతోందని, ఎందుకు సీబీఐ విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుకుంటున్నారా అని చురకలంటించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇచ్చిన నివేదికనే తప్పుపడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
డొల్ల ప్రాజెక్టుపై బీజేపీ రాజీపడదు..
మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సైతం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడేందుకు బీఆర్‌ఎస్ (BRS నేతలు అపసోపాలు పడుతున్నారని, ఇది ఎంత డొల్ల ప్రాజెక్టో ఎన్డీఎస్ఏ నివేదికను చదివి తెలుసుకోవాలని ఆయన సూచించారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు “కారుకూతలు కూశారని”, బీఆర్‌ఎస్ నేతల అవినీతిని బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణను నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని, బీఆర్‌ఎస్ చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని ఎన్వీఎస్ఎస్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!