TG HC On Local Body Election: స్థానిక సంస్థల ఎన్నికలపై(High Court) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు జరపలేదంటూ హైకోర్టు (High Court) ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కాగా, ఎన్నికల నిర్వహణకు 60 రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గడువు 2024, ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆరు నెలల్లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలి.
Also Read: Loans to Women: సంఘాల్లో సభ్యురాలిగా ఉన్న వ్యక్తికి సైతం రుణం!
న్యాయస్థానం విచారణ
అయితే, ప్రభుత్వం (Government) ఇప్పటివరకు ఎన్నికలు జరపలేదు. దాంతో కొంతమంది (High Court) హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం విచారణ జరిపింది. (Government) ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు నిర్వహించ లేదంటూ (High Court) హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.
60 రోజుల సమయం
కాగా, ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండాటానికి మరో 60 రోజుల సమయం కావాలని అడిగారు. దాంతో పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎన్నికలైనా పెట్టాలని, లేనిపక్షంలో పాత సర్పంచులను కొనసాగించాలని వాదించారు. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉన్నా ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ (High Court) హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు తరువాతే
స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తరువాతే జరుగుతాయని తెలుస్తున్నది. సోమవారం హైకోర్టు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని చెప్పిన నేపథ్యంలో ఈ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోందన్న ప్రచారం ఒకవైపు జరుగుతున్నది. మంత్రులు కూడా దీనికి సంబంధించి ప్రకటనలు కూడా చేశారు. మరోవైపు పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేస్తున్నారు. అయితే, కుల గణన, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా కోర్టు పరిధిలో ఉండడం, ఎన్నికల సంఘం 60 రోజుల గడువు అవసరమని తెలియ చేసిన నేపథ్యంలో హైకోర్టు తుది తీర్పులో ఏం చెబుతుందోనని ఆసక్తికరంగా మారింది.
Also Read: Bhu Bharati Act: ధరణి కష్టాలకు.. భూ భారతి చెక్ పెట్టేనా?