Samantha: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్'(Rakth Brahmand) అనే సినిమాలో నటిస్తుంది. ఇంకో వైపు నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తుంది. అలా నిర్మాతగా మారిన సామ్ తన అదృష్టాన్ని ‘శుభం'(Shubham) మూవీతో పరీక్షించుకుంది.
Also Read : Suryapet Gang War: వామ్మో ఇదేం ఫైటింగ్ రా సామీ.. నడిరోడ్డుపై చచ్చేలా కొట్టుకున్న యువకులు!
ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్లింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్ స్టార్(Jio Hotstar)లో కి వచ్చేసింది. సినీ లవర్స్ కూడా చూస్తున్నారు. సినిమాల పరంగా బాగానే ఉన్న సమంత, వ్యక్తిగత లైఫ్ లో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీ ఇన్‌స్టా(Instagram) లో పెట్టిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎ ప్లస్ ఫ్రెండ్.. నువ్వు నా లైఫ్ లో చాలా ముఖ్యమైన ఫ్రెండ్ .. నువ్వు నాకు ఎప్పుడూ బెస్టే.. లవ్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్’ అనే క్యాప్షన్ పెట్టి లవ్ సింబల్ ను యాడ్ చేసింది. దీంతో. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. నెటిజన్లు రాహుల్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Also Read : YSRCP: సింగయ్య నిజంగానే జగన్ కారు కిందపడి చనిపోయాడా.. వీడియోపై బోలెడన్ని డౌట్స్!