justice pc ghosh team visits medigadda barrage site ఆపరేషన్ మేడిగడ్డ.. జస్టిస్ పీసీ ఘోష్ బృందం పరిశీలన
A Special Commission Of Inquiry To Find The Culprits in the Kaleswaram Project
Political News

BRS: ఆపరేషన్ మేడిగడ్డ.. జస్టిస్ పీసీ ఘోష్ బృందం పరిశీలన

– బ్యారేజ్ దిగువన పగుళ్ల పరిశీలన
– ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాల సేకరణ
Medigadda barrage latest news(TS today news): కేసీఆర్ పాలనలో అతి పెద్ద తప్పుగా, అవినీతి మరకగా మిగిలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సైతం కారణం అయింది. కాంగ్రెస్ పాలన వచ్చాక, అసలీ ప్రాజెక్ట్ ఏంటి? మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలేంటి? ఇలా అనేక డౌట్స్‌కు సమాధానాల అన్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలోనే జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ భవిశ్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు. అనంతరం కమిషన్‌కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీపై ఏడో బ్లాకులో వంతెనపై కాలి నడకన సాగుతూ అణువణువునా తనిఖీ చేశారు. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పిల్లర్లను చూసి అధికారల నుంచి వివరాలను సేకరించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పీయర్ కుంగుబాటు వంటి అంశాలపై అధికారుల ద్వారా వివరాలను సేకరించారు. మేడిగడ్డ అతిథి గృహానికి చేరుకొని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై, పలు అంశాలపై విచారించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వ విచారణ చేయాలని సూచించడంతో క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటన చేస్తోంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..