Mani Ratnam
ఎంటర్‌టైన్మెంట్

Mani Ratnam: మణిరత్నం సారీ చెప్పేశారు.. నెక్ట్స్ ఇచ్చిపడేస్తారట!

Mani Ratnam: తమిళ సంచలన దర్శకుడు మణిరత్నం క్షమాపణలు చెప్పారు. ఎందుకు? అంత పెద్దాయన క్షమాపణలు చెప్పడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా! మణిరత్నం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన వల్ల ఎవరైనా నొచ్చుకుంటే వెంటనే క్షమాపణలు చెప్పేస్తారు. ఇది ఆయనతో షూటింగ్ చేసిన వారెందరో చెప్పారు. ఇప్పుడు కూడా తను రూపొందించిన సినిమా కారణంగా ఎందరో డిజప్పాయింట్ అయ్యారని ఆయన క్షమాపణలు కోరారు. ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా? రీసెంట్‌గా ఆయన దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life). శింబు (Silambarasan) ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ పరాజయాన్ని చవి చూసింది. దీంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైనందుకు మణిరత్నం క్షమాపణలు కోరారు.

Also Read- Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?

వాస్తవానికి ఈ సినిమా అంచనాలను అందుకోకపోవడానికి కారణం.. మణిరత్నం – కమల్ హాసన్ (Kamal Haasan) కాంబోలో ఇంతకు ముందు వచ్చిన సినిమానే. వారిద్దరి కలయికలో వచ్చి క్లాసికల్ హిట్ ‘నాయకుడు’. ఆ సినిమా తర్వాత దాదాపు 37 ఏళ్లకు వారి కాంబోలో వచ్చిన సినిమా కావడంతో.. ‘థగ్ లైఫ్’ ప్రకటించిన రోజు నుంచి భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు కమల్ హాసన్ అండ్ టీమ్ చేసిన ప్రమోషన్స్, సినిమా గురించి ఆయన మాట్లాడిన తీరు, మణిరత్నం సినిమా అనే ట్యాగ్.. ఇలా అన్నీ కూడా సినిమాపై క్రేజ్‌కు కారణమయ్యాయి. మరీ ముఖ్యంగా వారిద్దరి కాంబోలో అంతకు ముందు వచ్చిన ‘నాయకుడు’ సినిమాను మించి ఉంటుందని కమల్ చెప్పిన మాటలతో ఫ్యాన్స్ అంతా ఎంతగానో వేచి చూశారు. అలా వేచి చూసిన వారందరినీ ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది.

Also Read- Niharika Second Marriage: నా కూతురు విషయంలో ఆ తప్పు చేశా.. నిహారిక రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిన నాగబాబు?

దీంతో మణిరత్నం ప్రేక్షకులకు సారీ చెప్పి.. తన తదుపరి సినిమాతో అందరి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ‘‘కమల్, నా నుంచి ప్రేక్షకులు మరో ‘నాయకుడు’ సినిమాను ఆశించారు. అలా ఊహించుకుని, ‘థగ్ లైఫ్’పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ సినిమా కంటే కూడా గొప్ప సినిమాను చేయాలనే ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాం. అందుకు నేను చెప్పగలిగేది ఒక్కటే.. దయచేసి క్షమించండి. ‘నాయకుడు’ సినిమాను మించే సినిమా చేయాలనే ఆలోచనతోనే ‘థగ్ లైఫ్’ చేశాం. కాకపోతే భారీగా అంచనాలు ఉండటంతో, వాటిని అందుకోలేకపోయాం. మేము ఇచ్చిన కంటెంట్‌‌కు వారి శాటిస్‌ఫై కాలేదు. వారు ఇంకా ఏదో మా నుంచి కోరుకున్నారనేది మాత్రం నాకు అర్థమైంది’’ అని మణిరత్నం తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలోనే ప్రేక్షకులను రంజిపజేసే ప్రాజెక్ట్‌తో వస్తానని ఆయన మాటిచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!