Arvind Dharmapuri (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Arvind Dharmapuri: కేసీఆర్ ఫ్యామిలీని గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి.. బీజేపీ ఎంపీ

Arvind Dharmapuri: ఏపీ మాజీ సీఎం జగన్ (Former CM YS Jagan Reddy) ఇటీవల చేపట్టిన పల్నాడు జిల్లా పర్యటనలో.. పుష్ప 2 చిత్రంలోని రప్పా రప్పా డైలాగ్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే ఈ రప్పా రప్పా డైలాగ్ రచ్చ.. తెలంగాణకు సైతం పాకింది. రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సభలో రప్పా రప్పా డైలాగ్ తో ఉన్న ఫ్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు తాజాగా బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ నోట.. ఈ డైలాగ్ రావడం సంచలనం రేపుతోంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఆయన చెప్పిన రప్పా రప్పా డైలాగ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్, కేటీఆర్ ఓటమి ఖాయం
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ కు మళ్లీ 3.0 ఏంటని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఒక్క హరీశ్ రావు తప్ప.. మరెవరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆయనకు నియోజకవర్గం దాటితే మరెక్కడా ఆదరణలేదని సెటైర్లు వేశారు. ఈ దఫా ఎన్నికల్లో తండ్రి కొడుకులు (కేసీఆర్, కేటీఆర్) ఇద్దరు ఓడిపోవడం ఖాయమేనని అన్నారు. చెల్లెలు కవిత (Kavitha) రాజకీయ జీవితాన్ని ముగించాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్‌కు కూడా అదే గతి పట్టబోతోందని ఆరోపించారు.

రప్పా రప్పా డైలాగ్..
కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రప్పా రప్పా డైలాగ్ ను వాడారు. కేసీఆర్ ను కాళేశ్వరంలో, కవితను లిక్కర్ స్కామ్ లో, కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు కేసుల్లో, హరీశ్ రావును విద్యుత్ స్కామ్ లో గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైళ్లల్లో వేయాలని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రప్పా రప్పా స్కాములు అన్ని బయటపడతాయని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం బెదిరించి సాయంత్రం మిలాఖత్ అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవంటూ మండిపడ్డారు.

Also Read: Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం  

అమిత్ షా పర్యటన
జూన్ 29వ తేదీన నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు ధర్మపురి అర్వింద్ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారని చెప్పారు. నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త శకం ప్రారంభమైందన్నారు. అలాగే దివంగత నేత డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వివరించారు. అనంతరం స్థానిక పాలిటెక్నీక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళనం పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.

Also Read This: Upasana: రెండో పెళ్లికి రెడీ అవుతోన్న ఉపాసన.. సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!