Salman Khan : ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. సల్మాన్
Salman Khan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్‌ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ పేరు బాగా వినబడుతోంది. రీసెంట్ గా తన పెళ్లి గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎలాగో హిందీలో కూడా సల్మాన్ ఖాన్ అంతే. ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబందం లేకుండా తన అభిమానుల కోసం సినిమాలను తీస్తుంటాడు. ఇటీవలే సికిందర్ మూవీతో మన ముందుకు వచ్చాడు కానీ, హిట్ అవ్వలేదు.

Also Read: Upasana: రెండో పెళ్లికి రెడీ అవుతోన్న ఉపాసన.. సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్?

అలాంటి సమస్యతో బాధ పడుతున్నా? 

ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో తర్వాత తీయబోయే సినిమా పై జాగ్రత్తలు తీసుకుంటునట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలే సల్మాన్ ఖాన్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ లో పాల్గొన్న ఈ హీరో తన ఆరోగ్యం గురించి షాకింగ్ నిజాలను వెల్లడించాడు. తనకు ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే తీవ్ర సమస్య ఉందని, దానితో  బాధ పడుతున్నాను అని చెప్పాడు. ఇది నరాల సంబంధిత వ్యాధి. చాలా కాలం నుంచి ఈ సమస్యతో పోరాడుతున్నా.. ఈ ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిని “ఆత్మహత్య వ్యాధి” అని కూడా అంటారు. ఇది ముఖ భాగంలో భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది. ఇదిలా ఉండగా.. గతంలో కూడా సల్మాన్ మెదడుకు సంబంధించిన సమస్యలున్నాయని ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

Also Read:  Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?

పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్

ఇక ఇటీవలే పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు. ” నా లైఫ్ లో నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అందరికీ ఉన్నట్లే నాకు కూడా లవ్ స్టోరీలు ఉన్నాయి. కాకపోతే అవి బ్రేకప్ అయ్యాయి. నిజం చెప్పాలంటే నేను ప్రేమించిన అమ్మాయిలలో ఎలాంటి తప్పు లేదు. నేనే నాకు నచ్చినట్లు బిహేవ్ చేస్తాను. దాని వలన వాళ్ళు నాకు దూరమయ్యారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని సంతోషంగా చూసుకోలేక పోతే ఆమె నేను బాధ పెట్టినట్టే కదా.. అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నా ప్రేమ కథలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ, ఒక అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు చాలా బాధ పడ్డాను అంటూ ”  సల్మాన్ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..