Anganwadi – Panchayat: రాష్ట్రంలో పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ (Anganwadi) భవనాల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను పంచాయతీ రాజ్ (Panchayat Raj) శాఖ వేగవంతం చేసింది. ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు, రెండు అంగన్‌వాడీ (Anganwadi) భవనాల చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మొత్తం 1,148 అంగన్‌వాడీ (Anganwadi) భవనాలను నిర్మించాలని టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటికే 813 అంగన్‌వాడీ (Anganwadi) భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. మరో 98 చోట్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది.
Also Read:Sridhar Rao Audio Leak: కలకలం రేపుతున్న.. సంధ్య శ్రీధర్ ఆడియో!
రూ.20 లక్షలు ఖర్చు
ఉపాధి హామీ నిధుల ద్వారా ఒక్కో పంచాయతీ (Panchayat Raj) భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల ద్వారా రూ.8 లక్షలు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.2 లక్షలు, మహిళా శిశు సంక్షేమం నుంచి రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 1,148 గ్రామ పంచాయతీ భవనాలు, 1,148 అంగన్‌వాడీ భవనాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రత్యేకమైన డిజైన్లు
గతంలో ప్రారంభమైన కొన్ని భవనాల నిర్మాణాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే స్థలాల గుర్తింపునకు జిల్లా కలెక్టర్లు, డీఆర్‌డీడీఏలతో పంచాయతీ రాజ్ డైరెక్టర్ సృజన సమన్వయం చేస్తున్నారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి, వికారాబాద్, (Vikarabad) సంగారెడ్డి వంటి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, అలాగే ఏజెన్సీ ప్రాంతాలున్న ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో స్థలాల గుర్తింపునకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఆయా భవనాలను చూడగానే ప్రజలు అవి గ్రామ పంచాయతీ భవనాలని, అంగన్‌వాడీ భవనాలని గుర్తించేలా ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం గ్రామ పంచాయతీ భవనాలకు, అంగన్‌వాడీలకు వేర్వేరుగా డిజైన్లను రూపొందిస్తుంది.
త్వరలో శంకుస్థాపన: మంత్రి సీతక్క
“త్వరలో కొత్త గ్రామ పంచాయతీ (Panchayat Raj) భవనాలు, అంగన్‌వాడీ భవనాలకు శంకుస్థాపన చేస్తాం” అని మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. గతంలో చివరి త్రైమాసికంలో భవనాల నిర్మాణాలు చేపట్టడంతో పనులు పెండింగ్‌లో మిగిలిపోతున్నాయని, అందుకే ఈసారి మొదటి త్రైమాసికంలోనే స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. యూనిక్ డిజైన్‌తో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ (Anganwadi) భవనాల కోసం శరవేగంగా స్థలాలు గుర్తించడానికి కృషి చేసిన శాఖా అధికారులు, జిల్లా కలెక్టర్లను మంత్రి అభినందించారు.
Also Read: Afzalgunj Shooting Case: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసు మిస్టరీ వీడేనా?