Sridhar Rao Audio Leak(Image credit: twitter)
తెలంగాణ

Sridhar Rao Audio Leak: కలకలం రేపుతున్న.. సంధ్య శ్రీధర్ ఆడియో!

Sridhar Rao Audio Leak: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఈ మధ్యే అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. అయితే, ఆయన చావుకు తానే కారణమని, క్షుద్ర పూజలు చేసి లేపేశానంటూ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు (Sridhar Rao) మాట్లాడినట్టు ఉన్న ఆడియో ఒకటి బయటకొచ్చింది. అందులో ఓ కాంట్రాక్టర్‌ను నీకు కూడా క్షుద్ర పూజలు చేస్తానని బెదిరించినట్టు ఉన్నది.

Also Read: MLC Kavitha: బీసీలు రిజర్వేషన్ సాధించాలంటే ఉద్యమాలే మార్గం.. ఎమ్మెల్సీ కవిత

ఫోన్ చేసి బెదిరింపులు

కేఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ ద్వారా శ్రీధర్ రావు (Sridhar Rao) మట్టిని తరలించడంతోపాటు వేర్వేరు పనులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో రెడ్డికి దాదాపు కోటి రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. దీని గురించి ఆయన అడుగగా నన్నే డబ్బు అడుగుతావా, క్షుద్ర పూజలు చేసి (Maganti Gopinath) మాగంటి గోపీనాథ్‌ను చంపినట్టు నిన్ను కూడా అంతం చేస్తానంటూ భయపెట్టాడు. కిడ్నీలు ఫెయిలై చనిపోతావని, నీ భార్య వారం రోజుల్లో విధవరాలు అవుతుందని మాట్లాడాడు. దాంతోపాటు అసభ్యకర పదజాలంతో దూషించాడు. అతను మాట్లాడుతున్న సమయంలో సదరు కాంట్రాక్టర్ వీడియో తీసి బయటపెట్టాడు. దీంతో అదికాస్తా వైరల్​ అవుతున్నది.

ఇప్పటికే 40కి పైగా కేసులు

భవన నిర్మాణాలు చేస్తానని వినియోగదారులను నిండా ముంచేసిన కేసుల్లో సంధ్య శ్రీధర్ రావు (Sridhar Rao) నిందితుడిగా ఉన్నాడు. జంట నగరాల కమిషనరేట్ల పరిధిలో 40కి పైగా కేసులున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులను, సిస్టమ్‌ను మ్యానేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతుంటాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో తన బాడీగార్డ్‌తో బలవంతంగా అసహజ శృంగారం చేయగా కేసు నమోదైంది. ఎఫ్‌సీఐ కాలనీ ప్లాట్ల అంశంలోనూ కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూముల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొడుతుంటాడని, నిలదీస్తే బౌన్సర్లతో దాడులు చేయిస్తాడని బాధితులు వాపోతున్నారు. ఇదే క్రమంలో కాంట్రాక్టర్ కేఎన్ రెడ్డిని సంధ్య శ్రీధర్ రావు (Sridhar Rao) బెదిరించాడు. అందుకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతున్నది.

 Also Read: Afzalgunj Shooting Case: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసు మిస్టరీ వీడేనా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు