MP Kishan Reddy: లోక్ సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి జోష్ మీదున్న బీజేపీ(BJP)కి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ గా మారనున్నాయా? కాషాయసేన ఇన్నాళ్లు నేల విడిచి కత్తిసాము చేసిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే పార్టీకి తెలంగాణ(Telangana) వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలమైన పట్టు లేకపోవడంతో సవాళ్లు తప్పవనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. దీనికి తోడు తెలంగాణ కాషాయపార్టీ రథసారధి ఎన్నికపై ఆ పార్టీ అధిష్టానం సస్పెన్స్ కొనసాగిస్తోంది.
ఎవరికి కమలం పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే దానిపై కేడర్ అసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elctions) రణరంగానికి కసరత్తు మొదలవ్వడంతో పొలిటికల్ పార్టీలు(Political Partyes) క్షేత్రస్థాయి రాజకీయాలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపధ్యంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా ? కిషన్ రెడ్డి(Kishan Reddy) సారథ్యంలోనే లోకల్ బాడికి వెళ్తారా? అనే దానిపై అధిష్టానం క్లారిటీ ఇవ్వడం లేదు.
అభ్యర్థుల కోసం పక్కచూపులు
తెలంగాణ బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల గెలుపు జోష్ క్రమంగా తగ్గిపోయిందని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటం చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా ముందడుగు వేయకపోవడం వల్లే కేడర్ లో నిరుత్సాహం ఆవరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు బీజేపీకి కొన్ని జిల్లాల్లో అసలు పట్టే లేదనేది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు ప్రధాన సమస్యగా మారింది.
Also Read: Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
ఉమ్మడి ఖమ్మం(Khammam), నల్లగొండ(Nalgonda), వరంగల్(Warangal) జిల్లాల్లో బీజేపీకి కేడర్ బలంగా లేదు. మిగతా జిల్లాల్లో ఎంతోకొంత పట్టు సాధించిన బీజేపీకి నాయకత్వ లేమి తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల్లో గట్టిపట్టున్న లీడర్లు కాషాయపార్టీలో లేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల కోసం పక్కచూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
లీడర్లుగా మార్చేందుకు కృష్టి చేస్తారా
కాషాయ పార్టీలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, మరో ముగ్గురు ఎమ్మెన్సీలున్నారు. వీరి గెలుపులో కేడర్ పాత్ర ఎంతో కీలకం. అలాంటిది వారు గెలిచాక పార్టీ కేడర్ ను లీడర్లుగా డెవలప్ చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెప్పుకునే కమలనాథులు.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని కేడర్ లో చర్చ జరుగుతోంది.
ఇక పార్టీ రాష్ట్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడం సైతం కేడర్ కు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. బీజేపీ(BJP) నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు.. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ మేరకు బాధ్యత తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాడర్ ను లీడర్లుగా మార్చేందుకు కృష్టి చేస్తారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Drug Awareness Wing: డ్రగ్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యం.. డీజీపీ జితేంద్ర