Shivathmika Rajasekhar
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: ‘ముందు పెంచుకో.. ఆ తర్వాతే ఛాన్స్’.. స్టార్ హీరో కుమార్తెకు చేదు అనుభవం!

Tollywood: సినిమాల్లో ఛాన్స్ రావడం అంటే అంత ఆషామాషీ విషయం కానే కాదు. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. పెద్ద పెద్దో్ళ్ల కూతుళ్లు, కొడుకులకు అవకాశాలు రావట్లేదు. అందులోనూ అందచందాలున్నా.. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ అవకాశాలు అంతంత మాత్రమే. ఇక హీరోయిన్‌గా ఛాన్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు అయ్యే పనే కాదు. కొందరైతే ‘టాలెంట్’ ఉంటే చాలు అవకాశాలు వాటంతట అవే వచ్చేస్తాయనే నమ్ముతుంటారు. అది ఎందుకు.. ఏంటి అనేది ఇక్కడ అప్రస్తుతం. ఇప్పుడిక అసలు విషయానికొస్తే.. యాంగ్రీస్టార్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక (Shivatmika) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలో కొన్ని చేదు అనుభవాలను చవిచూసినట్లు చెబుతోంది. ముఖ్యంగా.. ‘ముందు పెంచుకో.. ఆ తర్వాతే అవకాశం’ అని కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు నేరుగానే ఎలాంటి మొహమాటం లేకుండానే చెప్పేశారట. ఇది ఒకరకంగా చూస్తే యంగ్ గర్ల్‌కు అవమానమే అని చెప్పుకోవచ్చు. ఈ విషయాలన్నీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఎలాంటి అనుభవాలు ఎదురుచూడాల్సి వచ్చింది? అనే విషయాలు శివాత్మిక మాటల్లోనే చూద్దాం..

Read Also- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!

హీరో కూతురైనా తప్పలేదు!
‘ నేను హీరో రాజశేఖర్ కుమార్తెను అయినప్పటికీ నాకు చేదు అనుభవాలు తప్పలేదు. నన్ను ఓ సినిమా నుంచి సడన్‌గా తీసేసారు. అంతేకాదు ముందుగా అవి పెంచుకో.. పెంచుకుంటేనే సినిమాల్లో అవకాశం ఇస్తామన్నారు. అవి అంటే అర్థం సోషల్ మీడియాలో ఫాలోవర్స్. నాకు పెద్దగా ఫాలోవర్లు లేకపోవడంతో కొన్ని సినిమాలు వచ్చినట్లు వచ్చి చేజారిపోయాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి.. ఫాలోవర్స్ పెరిగితేనే అవకాశాలు ఇస్తామని మొహం మీదనే నిర్మాతలు, డైరెక్టర్లు కొందరు చెప్పేశారు. వాళ్ల మాటలు విని నాకు చాలా చిరాకుగా అనిపించింది. ఎందుకంటే నాకు నా నటన మీద అయితే చాలా నమ్మకం ఉంది. కానీ, ఇలా పెంచుకో అనడం నాకు నచ్చలేదు. అయినా, సోషల్ మీడియాలో (Social Media) ఫాలోయింగ్ ఉంటేనే సినిమాల్లో ఛాన్సులు అని చెప్పడం ఏం పద్ధతి? అయినా నేను నటిని కదా..? నాకెందుకు ఫాలోవర్స్? ఇన్‌ఫ్లూయెన్సర్ అయితే కదా? ఫాలోవర్స్ కావాలి’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ‘ముందు’ పెంచుకో అనే దానికి క్లారిటీ వచ్చింది కదా.. అదన్న మాట సంగతి. కాగా, దొరసాని మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బేబీ.. ఇప్పుడు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తోంది.

Sivathmika

దుమ్ము దులపడమే!
ఒకప్పుడు సంగతి అటుంచితే.. ఇప్పుడు మాత్రం బ్యూటీ శివాత్మిక సోషల్ మీడియాలో యమా చురుకుగా ఉంటోంది. తన సినిమాల అప్డేట్‌లు, వ్యక్తిగత జీవిత విశేషాలు, ఫ్యాషన్ ఫోటోషూట్‌లు, ట్రెండింగ్ అంశాలపై నిత్యం పంచుకుంటూనే ఉంటుంది. తరచుగా ఫోటోలు, వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేయడం ద్వారా తన ఫాలోవర్లతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటోంది. మరీ ముఖ్యంగా.. పాపులర్ రీల్స్, పాటలు, ఛాలెంజ్‌లలో పాల్గొంటూ యువతను ఆకట్టుకుంటూ ఉంటుందీ ముద్దుగుమ్మ. తన అభిమానులతో ప్రశ్న-జవాబు సెషన్లు నిర్వహించడం, వారి కామెంట్లకు స్పందించడం ద్వారా వ్యక్తిగత సంబంధాన్ని మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే.. కుర్రకారు మతిపోయేలా ఆకర్షణీయమైన ఫ్యాషన్ ఫోటోషూట్‌లు పోస్ట్ చేస్తూ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తన సినిమా ప్రమోషన్లలోనూ సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తోంది శివాత్మిక.

Sivathmika Rajasekhar

ఇప్పుడిదే ట్రెండ్..!
చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు నటీనటులను ఎంపిక చేసుకునేటప్పుడు వారి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే.. ఎక్కువ ఫాలోవర్లు ఉంటే, ఆ సినిమాకు పబ్లిసిటీ కూడా పెరుగుతుందని భావిస్తుంటారు. సినిమా షూటింగ్ మొదలుకుని.. రిలీజ్ వరకూ ప్రమోషన్లలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందనేది వారి అభిప్రాయం. నటీనటులకు మంచి ఫాలోయింగ్ ఉంటే, వారు తమ సినిమాలను విస్తృత ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి ఇది ఒక బలమైన వేదిక అవుతుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది నటీ, నటుల బ్రాండ్ వ్యాల్యూను పెంచుతుంది. ఇది కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, అడ్వర్టైజ్‌మెంట్‌లు వంటి ఇతర అవకాశాలకు కూడా దారి తీస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. నటీనటులు తమ అభిమానులతో నిరంతరం కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా అనేది సులువైన మార్గం.

Read Also- YS Jagan: ఏ2గా వైఎస్ జగన్.. త్వరలోనే అరెస్ట్‌?

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు