Prince Movie Opening
ఎంటర్‌టైన్మెంట్

Prince: ప్రిన్స్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ప్రారంభం

Prince: బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా మరో నూతన చిత్రం మొదలైంది. సుహానా ముద్వాన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో సొనైనా, నెల్లూరు సుదర్శన్ ఇతర ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను లైట్ స్టోర్మ్ సెల్యూలాయిడ్స్ (Light Storm Celluloids) బ్యానర్‌పై కుమార్ రవి కంటి స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ సినిమా తాజాగా కెఎల్ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ ముహూర్తపు సన్నివేశానికి బేబీ దియ రవికంటి క్లాప్ కొట్టారు. శ్రీమతి సుమ రవికంటి కెమెరా స్విచ్చాన్ చేశారు. మొదటి షాట్‌కు బేబీ మాయ రవి కంటి గౌరవ దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read- Star Comedian: స్నానం చేయక చేతికి గజ్జి వచ్చిందంటూ.. ఎమోషనల్ అయిన స్టార్ కమెడియన్

ఈ సందర్భంగా దర్శక నిర్మాత కుమార్ రవి కంటి (Kumar Ravi Kanti) మాట్లాడుతూ.. ఓ మంచి కథతో ప్రిన్స్ హీరోగా ఈ మూవీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రిన్స్ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా ఉంటుందని నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఈ తరహా కాన్సెప్ట్‌తో సినిమా అయితే రాలేదు. నేను కథ చెప్పిన వెంటనే ప్రిన్స్ ఇందులో నటిస్తానని చెప్పారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. ఈ చిత్ర షూటింగ్‌ని జూన్‌లో ప్రారంభించి.. జూలై, ఆగస్ట్‌లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపనున్నాం. టాకీ పార్ట్ పూర్తవ్వగానే, విదేశాలలో సాంగ్స్ చిత్రీకరిస్తాము. స్టార్ యాక్టర్స్, కొత్తవారి కలయికలో రాబోతున్న ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. జి. అమర్ కెమెరా, అర్జున్ సూరిశెట్టి ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం.

Also Read- Kajal Agarwal : ఆ స్టార్ హీరోతో కాజల్ అగర్వాల్ ఎఫైర్.. 10 ఏళ్ల తర్వాత ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన హీరో?

ఇకపై మా బ్యానర్ నుంచి వరుస చిత్రాలను తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మరో సినిమాను అనౌన్స్ చేస్తాం. మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలనే ధ్యేయంతో మా లైట్ స్టోర్మ్ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాం. ఈ జర్నీలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాతో ఒక మంచి సినిమా ప్రేక్షకుల‌కు అందించబోతున్నానని నమ్మకంగా చెప్పగలను. ప్రేక్షకులు మా టీమ్‌ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని తెలిపారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మరో అప్డేట్‌లో తెలియజేస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్