Star Comedian: పటాస్ షోలో రైటర్ గా, కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్‌ప్రెస్ హరి టీవీ షోలు, మూవీస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలలో రైటర్ గా, కమెడియన్ గా వరుస షో లతో దూసుకెళ్తున్నాడు. అయితే, తాజాగా ఎక్స్‌ప్రెస్ హరి ఆహాలో ప్రసారమయ్యే కాకమ్మ కథలు టాక్ షో కి హాజరయ్యాడు. ఈ షోలో తన జీవితంలో పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అవుతున్నాడు.
ఎక్స్‌ప్రెస్ హరి మాట్లాడుతూ.. ” మాది ఒక రైతు కుటుంబం. మా అమ్మా నాన్నలు ఇద్దరూ పొలం పనులకు వెళతారు. నాకు ఒక చెల్లి ఉంది. మా ఇద్దర్ని చదివించడానికి అమ్మా నాన్నల దగ్గర డబ్బు లేదు. అందుకే చిన్నప్పుడు నుంచి రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళిపోయాను. అక్కడ అన్నిఫ్రీ కదా.. అందుకే అక్కడే చదువుకున్నాం. స్నానం చేయడానికి బాత్ రూమ్ లు కూడా ఉండేవి కావు. మొత్తం మీద 8 ట్యాప్ లే ఉండేవి. వాటిలో నాలుగే పనిచేసేవి. గంటలో అందరూ స్నానం చేయాలి. ఎవరూ అలాంటి బాధలు పడ కూడదు. నేను అయితే.. ఎక్కువ రోజులు స్నానం కూడా చేయలేదు.. నా కుడిచేతికి గజ్జి వచ్చింది. అన్నం కూడా సరిగా తినే వాడిని కాదు. అన్నం తింటుంటే ఆ బ్లడ్ అన్నంలో పడేదంటూ ” ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు.
Also Read: Tollywood: 40 ఏళ్లు దాటిన తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. కొత్త జంట ఫొటోలివే
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు