Vishnu Manchu: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై డా. ఎం. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు, పోస్టర్‌లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో శనివారం ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘కన్నప్ప’ విష్ణు మంచు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ప్రతీది శివానుగ్రహంతోనే జరిగింది. ఈ జర్నీలో నాకు విజయ్, వినయ్ వెన్నంటే ఉన్నారు. 2017లో మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సీని కలిశాను. ఈ కన్నప్పని ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను అన్నది చెప్పలేను. కానీ ఎప్పుడు చేసినా ఈ సినిమాకు మీరే మ్యూజిక్ ఇవ్వాలని స్టీఫెన్‌కి చెప్పాను. ఈ కథ కోసం పరుచూరి గోపాలకృష్ణ అంకుల్ చాలా కష్టపడ్డారు. అలాగే శివ బాలాజీ చేసిన సాయాన్ని బయటకు చెప్పలేను. మోహన్‌లాల్ అంకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా కోసం వచ్చిన అక్షయ్ కుమార్ సార్‌కి థాంక్స్. శరత్ కుమార్ సార్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. తమిళంలో ఈ చిత్రం పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతోందంటే దానికి కారణం ఆయనే. న్యూజిలాండ్ షూటింగ్‌కి కూడా ఆయనే సపోర్ట్ చేశారు. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే బ్రహ్మానందం అంకుల్ దీవెనలు అందిస్తూ ఉన్నారు. ఆంటోని ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కనిపించని హీరో అతనే.
Also Read- Niharika Konidela: ఆ హీరోతో నా రిలేషన్ ఐదేళ్లు.. లవ్ సింబల్ తో హింట్ ఇచ్చిన నిహారిక కొణిదెల?
నా కెరీర్‌లో ఉన్న దర్శకులందరిలోనూ ముఖేష్ ది బెస్ట్. ‘కన్నప్ప’ ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఎన్నో బాధలు పడ్డాం. అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీస్తున్నావ్ అని శివ రాజ్ కుమార్ సార్ అడిగారు. 50 ఏళ్ల తరువాత మళ్లీ మన ‘కన్నప్ప’ గురించి ఈ తరానికి చెప్పాలని.. ఆ శివుడే నాతో ఈ మూవీని తీయించారేమో అని శివన్నతో చెప్పాను. స్టీఫెన్ ఈ సినిమాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ‘శివా శివా శంకరా’ పాట నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్‌గానే అనిపిస్తుంటుంది. ఆ పాటే నన్ను కాపాడింది.
Also Read- Kuberaa: ఫస్ట్ టైమ్ 3 ప్లస్ రేటింగ్స్.. ‘కుబేర’ థ్యాంక్స్ మీట్‌లో నాగార్జున ఎమోషనల్!
స్నేహంలో కృష్ణుడిగా, కర్ణుడిగా రెండు రకాలుంటాయి. నా లైఫ్‌లో కృష్ణుడిగా ప్రభాస్ ఉంటారు. అసలు ఈ సినిమాలో చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. నాన్న మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీలో చేశారు. ఒక స్టార్‌గా కంటే.. ప్రభాస్ మానవత్వం చాలా గొప్పగా ఉంటుంది. కొంత డబ్బు, పేరు వచ్చాక అంతా మారిపోతారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా అలానే ఒదిగి ఉంటారు. నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్‌కి కర్ణుడిని. ప్రభాస్ నా లైఫ్‌లో ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాను. నాకు మా నాన్న దేవుడు. ప్రభు దేవా మాకోసం మూడు పాటల్ని చేశారు. మా ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న రాబోతోంది. ఆ శివుని ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమతో పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు