Drug Awareness Wing (imagcredit:swetcha)
తెలంగాణ

Drug Awareness Wing: డ్రగ్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యం.. డీజీపీ జితేంద్ర

Drug Awareness Wing: తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చటమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేస్తోందని డీజీపీ జితేందర్(DGP Jitender) చెప్పారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల(Drugs) దందా చేస్తున్న వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తున్నామన్నారు. యాంటీ నార్కొటిక్​బ్యూరో(Anti Narcotics Bureau) ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీస్ కమాండ్​కంట్రోల్ సెంటర్లో డ్రగ్స్​అవేర్​నెస్ వీక్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దురదృష్టవశాత్తు చాలామంది యువకులు రాష్ట్రొలో డ్రగ్స్‌(Drugs)కు అలవాటు పడుతున్నారన్నారు. తద్వారా బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటుండటంతోపాటు కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని చెప్పారు.

విద్యార్థులతో ప్రతిజ్ఞ

మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల శారీరక, మానసిక సమస్యలకు గురవుతుండటమే కాకుండా క్రమంగా మృత్యు ముఖానికి చేరుకుంటారని చెప్పారు. విద్యార్థులు తమ జీవితం అనే పుస్తకంలో మంచి విషయాలను రాసుకోవాలన్నారు. నో టు డ్రగ్స్(No To Drugs) అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఒక్కో విద్యార్థి కనీసం పదిమందికి నో టు డ్రగ్స్ అని చెప్పించాలన్నారు. యాంటీ నార్కొటిక్​బ్యూరో డైరెక్టర్​సందీప్ శాండిల్య డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పని చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యా సంస్థల పరిసరాల్లో ఎక్కడైనా డ్రగ్స్ దందా నడుస్తుంటే 1908 నెంబర్​ కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. 87126671111 నెంబర్​ పై వాట్సాప్ కూడా చేయవచ్చని చెప్పారు.

Also Read: Bhatti Vikramarka: అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ.. డిప్యూటీ సీఎం

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ

సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్​ కలెక్టర్​ దాసరి హరిచందన, ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక, 15 స్కూల్లకు చెందిన 2వేల మంది విద్యార్థులు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించి ఆనందించారు. ముఖ్యంగా పోలీసులు ఉపయోగించే ఆయుధాల స్టాల్​ వద్ద ఎక్కువగా సందడి చేశారు.

Also Read: Konda vs Congress: కొండా వర్సెస్ కాంగ్రెస్.. వరంగల్‌ నేతల మధ్య కోల్డ్‌వార్!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?