Aamir Khan - Gauri Spratt (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Aamir Khan – Gauri Spratt: అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఇద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!

Aamir Khan – Gauri Spratt: బాలీవుడ్ లో కొత్త ప్రేమ జంట పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో అమీర్ ఖాన్.. తన కొత్త డేటింగ్ ప్రేయసిని ప్రకటించారు. గురువారం జూన్ (19) తన పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) తో తాను డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆమెపై ఉన్న ప్రేమను బహిరంగంగా చాటుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ జంట గురించి తెగ చర్చ జరుగుతోంది. అమీర్ తో పోలిస్తే గౌరీ స్ప్రాట్ చాలా యంగ్ గా ఉండటంతో ఆమె వయసు ఏంత ఉండొచ్చని సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వయసుతోపాటు.. గౌరీ స్ప్రాట్ కి సంబంధించిన కీలక విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

వయసు వ్యత్యాసం ఏంతంటే?
అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వయస్సుల పరంగా వారిద్దరి మధ్య 14 ఏళ్ల వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. అమీర్ ఇటీవలే తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. గౌరీ స్ప్రాట్ వయసు ప్రస్తుతం 46 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par)కి సంబంధించి గత రాత్రి ప్రీమియర్ నైట్ జరిగింది. ఇందులో జంటగా పాల్గొన్న అమీర్ – గౌరీ మరోమారు అందరి దృష్టిని ఆకర్షించారు.

అమీర్ – గౌరీ పరిచయం
గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే.. ఆమెది బెంగళూరు. ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె ఆమె. ఫ్యాషన్ కోర్స్ పూర్తి చేసి లండన్‌ యూనివర్సిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్‌ అండ్‌ ఫొటోగ్రఫీలో శిక్షణ పొందారు. ముంబయిలో ‘బీబ్లంట్’ పేరుతో ఒక సెలూన్ సైతం ఆమె నడుపుతున్నారు. బీటౌన్ కు చెందిన ఎందరో సెలబ్రిటీలు అక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం గౌరీ.. అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలో వర్క్ చేస్తున్నారు. సుమారు 18 నెలలు నుంచి వీరు డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.

Also Read: Nalgonda Crime: మహిళతో ఎఫైర్.. చెట్టుకు కట్టేసి.. కళ్లల్లో కారం కొట్టి.. యువకుడి హత్య!

కొత్త మూవీకి మంచి రెస్పాన్స్
అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’.. జూన్ 20న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో జెనీలియా (Genelia)
హీరోయిన్ గా చేసింది. అపర్ణ పురోహిత్, ఆరోష్ దత్తా, వేదాంత్ శర్మ, రిషి షహానీ, డాలీ అహ్లువాలియా తివారీ, గోపి కృష్ణన్ వర్మ తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించారు. తెలుగులోనూ ఈ సినిమా డబ్ కావడం గమనార్హం.

Also Read This: Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!