Kuberaa OTT: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలలో.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). ఈ సినిమా జూన్ 20, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేదు. ఆ లోటుని ‘కుబేర’ చిత్రం తీర్చేసింది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. అదిరిపోయే రేటింగ్స్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా షాకింగ్ ధరకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Samantha: చైతూతో కలిసి ప్రమోషన్స్.. సమంత షాకింగ్ రియాక్షన్!
‘కుబేర’ ఓటీటీ పార్టనర్ మరెవరో కాదు అమెజాన్ ప్రైమ్ వీడియో. థియేటర్లలో ఈ సినిమా రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే డీల్‌తో ప్రైమ్ వీడియో భారీ ధరను వెచ్చించి హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను రూ. 50 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ధనుష్, నాగార్జున, రష్మిక వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చేయడంతో.. ‘కుబేర’ ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
నిర్మాతలపై ఓటీటీ సంస్థ ఒత్తిడి:
వాస్తవానికి ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. దీంతో చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయాలని, సదరు ఓటీటీ సంస్థ నుంచి తమకు ఒత్తిడి వచ్చినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలు వెల్లడించిన విషయం తెలిసిందే. జూన్ 20న ఈ సినిమాను కనుక థియేటర్లలో విడుదల చేయని పక్షంలో.. ఓటీటీ ఒప్పందంలో రూ. 10 కోట్లు తగ్గిస్తామని స్ట్రీమింగ్ దిగ్గజం బెదిరించిందని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థలు.. సినిమాల విడుదల విషయంలో ఎలాంటి ఒత్తిడి చేస్తున్నాయో.. నిర్మాతలు ఇక్కడ ప్రస్తావించడం విశేషం.
Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘కుబేర’కు డే 1 షాకింగ్ కలెక్షన్స్
‘కుబేర’ మొదటి రోజు కలెక్షన్లతో చిత్రయూనిట్ షాకయింది. విడుదలకు ముందు ప్రీ బుకింగ్ అడ్వాన్స్‌ను బట్టి ఈ సినిమా మొదటి రోజు దాదాపు రూ. 8 కోట్లు కలెక్ట్ చేస్తుందని చిత్రయూనిట్ భావించింది. అనూహ్యంగా ఈ సినిమా మొదటి రోజున రూ. 13 కోట్లు సాధించడంతో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటం, సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉండటంతో.. కలెక్షన్లు మరింతగా పెరుగుతాయిని, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు