koushik reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. ఎయిర్ పోర్టులో పట్టుకున్న పోలీసులు

Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుబేదారి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కౌశిక్ రెడ్డిపై కేసు

హనుమకొండ జిల్లా కమలాపురం మండల పరిధిలోని వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారిని కౌశిక్ రెడ్డి బెదిరించారు. దీనికి సంబంధించి బాధిత వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పోలీసులను ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కాదని వ్యాపారం చేసుకోలేరని డబ్బులు ఇవ్వాల్సిందేనని లేదంటే చంపేస్తానని భయపెట్టారని ఆమె పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

హైకోర్టులో చుక్కెదురు

తనపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ తప్పదని కౌశిక్ రెడ్డి భావించారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నాలుగు రోజుల క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలన్న కౌశిక్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయన వినతిని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.

Read Also- MP Kishan Reddy: క్రాస్ రోడ్‌లో తెలంగాణ ప్రజలు.. పూర్తిగా విఫలమైన కాంగ్రెస్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్

కోర్టు ఎలాంటి అభ్యంతరం తెలుపకపోవడం, కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సదరు కేసుకు సంబంధించి శనివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా సుబేదార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు పోలీసులు.

అక్రమ కేసులకు నిజాయితీ తలవంచదు..

అరెస్ట్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. కుట్రలు, అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నిజాయితీ తలవంచదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కౌశిక్‌ను శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానంగా భావిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్‌ను ఆపగలం అనుకోవడం మూర్ఖత్వాన్ని పరాకాష్ట అని మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టించి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నదని కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!