MP Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని స్థానాల్లో గెలుపుపై ఫోకస్ చేయాలని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర(BJP) కార్యాలయంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) వర్క్ షాప్‌లో కిషన్ రెడ్డి మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు క్రాస్ రోడ్‌లో ఉన్నారని, ఒకవైపు పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్(Congress) ఉందని, మరోవైపు ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్ ఉందని ఆయన విమర్శలు చేశారు. ఈ సమయంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.
నేతల ఫోన్లూ గతంలో ట్యాప్
ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఎన్నో చేస్తోందని, కానీ తాము ఆరు గ్యారంటీల అమలు దిశగా పోరాడుతామని వెల్లడించారు. బీజేపీ ఆఫీస్ సిబ్బంది, నేతల ఫోన్లూ గతంలో ట్యాప్(Phoe Tapping) చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని కిషన్ రెడ్డి(Kishan Reddy) అనుమానం వ్యక్తంచేశారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కొత్త రక్తంతో పార్టీ మండల కమిటీలు ఏర్పాటయ్యాయని, మండల, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: Bunker Buster Bomb: అణుబాంబుకి కజిన్.. బరువు 14 వేల కిలోలు.. విధ్వంసం చెప్పలేనంత!
కేంద్ర సహకారం లేకుంటే
తెలంగాణ ప్రజలకు అకాంక్షలకు అనుగుణంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీజేపీయే అధికారంలోకి రావాలని, ఐక్యమత్యంతో, కమిట్ మెంట్‌తో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. కొత్త నాయకత్వం, యువ రక్తంతో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కేంద్ర సహకారం లేకుంటే తెలంగాణలో(Telangana development) అభివృద్ధి జరగదన్నారు. రాష్ట్రంలో బీజేపీలో చేరేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని, వారందరినీ చేర్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ నెల25న ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. రాష్ట్రంలో కొత్త నాయకత్వం వచ్చాక జిల్లా కమిటీలు పూర్తి చేసుకోవాలని స్పష్టంచేశారు.
Also Read: MLA Veerlapalli Shankar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!