Chamala Kiran Kumar (imagcredit:twitter)
తెలంగాణ

Chamala Kiran Kumar: హరీష్​రావు కీలక స్కెచ్.. కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం

Chamala Kiran Kumar: కేసీఆర్ ను విలన్‌ను చేసి తద్వారా తాను లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి హరీష్​రావు(Harish Rao) ప్లాన్ చేశారని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ప్రకటించారు. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్(BRS) రాజకీయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్‌తో ప్రాజెక్టులు కడితే బాగుండేదన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందన్నారు. 2016 సీడబ్ల్యూసీ(CWC) మీటింగ్ లో కేసీఆర్ ఏం మాట్లాడారో? బీఆర్ ఎస్ నేతలు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు.

కేసీఆర్ అపార జ్ఞానం వలనే కాలేశ్వరం కూలేశ్వరం అయిందని విమర్శించారు. జగన్ రెడ్డితో నాలుగు సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు కేసీఆర్(KCR) అన్యాయం చేశారన్నారు. హరీష్​ వైఖరి వలనే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్లు తరలించుకుందామనే ఆలోచన చేశారన్నారు. గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ ఎస్ నేతలు, కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హరీష్​ రావుకు కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశం ఉన్నదన్నారు.

Also Read: BRS on Congress: బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం.. కాంగ్రెస్ తీరుపై సమీక్ష

బీఆర్ఎస్(BRS) నేతలు సీఎం కుర్చీలో రేవంత్ ను చూడలేకపోతున్నారన్నారు. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైందన్నారు. బనకచర్ల(Banaka Cherla Project) విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ కమిట్మెంట్ అర్థం చేసుకోవాలని సూచించారు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్(All Party Meeting) నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేశారన్నారు.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!