Srinivas Goud: మహబూబ్ నగర్‌ను ఏం చేయదలుచుకున్నారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivss Goud) డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్‌కు ఈ దుస్థితి ఏమిటి? అని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి(Ranga Reddy) ద్వారా ఆరునెలల్లో నీళ్లు ఇస్తామన్న గడువు దాటిపోయిందని ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియాతో మాట్లాడారు. వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారన్నారు. కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండలో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేదన్నారు. ఇప్పుడు జూరాలకు వరద పొటెత్తుతున్నా నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లు లేక రైతులు ఇబ్బంది
నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయన్నారు. ఆల్మట్టి, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదన్నారు. వస్తున్న నీటిని వాడుకోవడం పై కనీసం ఓ సమీక్ష కూడా చేయలేదని, జూరాలపై ఆధార పడ్డ నెట్టెం పాడు, బీమాలకు నీళ్లు తరలించడం లేదన్నారు. ఈ సారి ముందు వర్షాలు పడ్డా నీళ్లు సద్వినియోగం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నీళ్లు నదిలోకి వదులుతున్నారని, యాసంగిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు.ఈ వర్షా కాలంలో నీళ్ళుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగం బండకు మరమ్మతులు చేయక నీళ్లు నింపుకోని పరిస్థితి దాపురించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉందన్నారు.
Also Read: BRS on Congress: బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం.. కాంగ్రెస్ తీరుపై సమీక్ష
గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమా
గ్రావిటీ ద్వారా జూరాల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. జూరాల గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని పూడికతో నిండి పోయిందని ఆరోపించారు. అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పడ్డ ప్రతీ వాన చినుకును సద్వినియోగం చేసుకునేలా అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి ఉండేదన్నారు. రిజర్వాయర్లు ఉన్న ప్రాంతంలో మంత్రులు, అధికారులు పర్యటించాలని, సంగం బండ గేట్లకు, భూత్పుర్ రిజర్వాయర్ గేట్ల కు తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో రిజర్వాయర్లు నింపక పోతే ప్రభుత్వానిదే భాద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు విచారణ!