CM Revanth Reddy: రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ (Anda Pradesh) ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు (Patil) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth reddy) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విజ్ఞప్తి చేశారు. బనకచర్ల విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ 1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యహరిస్తున్నదని కేంద్రమంత్రికి తెలియజేశారు. ఢిల్లీలోని శ్రమ భవన్‌లో సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమత్రి సమావేశమయ్యారు.
బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ (Telangana) ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) ప్రతిపాదిస్తున్నట్లు ఏపీ చెబుతోందని, జీడబ్ల్యూడీటీ 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావన లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జలశక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని, బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తున్నదని వివరించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు విచారణ!
నిబంధనల ఉల్లంఘనలే..
బనకచర్లలో నిబంధనలు పాటించని ఆంధ్రప్రదేశ్ (Anda Pradesh) వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంతరకరమని జలశక్తి మంత్రితో సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం, జలశక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా చూడాలని సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి, (Revanth Reddy) మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) రిక్వెస్ట్ చేశారు. సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని తెలియజేశారు. జీడబ్ల్యూడీటీ 1980 నిబంధనల ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నదని వివరించారు.
జాతీయ ప్రాజెక్టులైన పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో తాము సిద్ధమని తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ 2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యలు సామరస్య పూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు. కేంద్ర స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ పెట్టిన ప్రపోజల్స్
– 1500 టీఎంసీలకు వాడుకునేలా అనుమతులు ఇవ్వాలి.
– తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్(Anfra Pradesh) నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలి.
– ఏపీకి వేగంగా అనుమతులు ఇచ్చి, తెలంగాణపై వివక్ష చూపడం సరికాదు
– పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలి.
– గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలి.
Also Read: MLA Veerlapalli Shankar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!