Telangana Ministers
Politics

Telangana: ఇన్‌ఛార్జీ మంత్రుల నెత్తిన పెద్ద బాధ్యతలు!

Telangana: తెలంగాణలోని జిల్లాల అభివృద్ధి పూర్తి బాధ్యత ఇన్‌ఛార్జీ మంత్రులకే ప్రభుత్వం అప్పగించింది. వారి వివరాల ఆధారంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. దీంతో గత ప్రభుత్వం కంటే మెరుగైన అభివృద్ధి చూపాలని ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వం అని చాటిచెప్పేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఇన్‌ఛార్జీ మంత్రులు నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నివేదికను రూపొందించినట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది.

Read Also-  KTR And Harish: అవును.. కేటీఆర్-హరీశ్ ఒక్కటయ్యారు!

ఏమేం చేయాలి?
కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గ్రామాల అబివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించాల్సిన భవనాలు ప్రారంభం పెండింగ్‌లో ఉన్నాయా? ప్రారంభం కాలేదా? కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ భవనాలు, ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి.. ప్రభుత్వం తాగునీరు, పారిశుధ్యం, పథకాలు ఏ దశలో ఉన్నాయి.. అర్హులకు అందుతున్నాయా? రోడ్ల పరిస్థితి ఏంది? గ్రామాల్లో వీధుల్లో సీసీలు ఉన్నాయా? ఇలా అన్ని వివరాలను నియోజకవర్గాల వారీగా సేకరిస్తున్నట్లు సమాచారం. ఆ బాధ్యతను ఉమ్మడి జిల్లాకు ఇన్‌ఛార్జీలుగా ప్రభుత్వం నియమించిన వారే అప్పగించింది. ప్రస్తుతం కరీంనగర్ ఇన్‌ఛార్జీగా తుమ్మల నాగేశ్వర్ రావు, నల్లగొండ- అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మం-వాకిటి శ్రీహరి, మెదక్-జి.వివేక్, నిజామాబాద్- సీతక్క, ఆదిలాబాద్-జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్- పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి-శ్రీధర్ బాబు, మహబూబ్ నగర్-దామోదర రాజనర్సింహ, వరంగల్-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్‌ఛార్జీలుగా ఉన్నారు. ఇప్పటికే ఇన్‌ఛార్జీలుగా వ్యవహరించిన మంత్రులంతా ఆయా జిల్లాలకు చెందిన ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. ఆయా సమాచారాన్ని నివేదిక రూపంలో తయారు చేసినట్లు తెలిసింది.

మార్పులు.. చేర్పులు ఇలా..
ఈ నెల 13న ముగ్గురు మంత్రులను ఇన్‌ఛార్జీ బాధ్యతల నుంచి తొలగించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (కరీంనగర్), కోమటిరెడ్డి (ఖమ్మం), సురేఖ (మెదక్) బాధ్యతలు అప్పగించారు. అయితే కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులను కొత్తవారిని తీసుకోవడంతో వారికి ఇన్‌ఛార్జీ బాధ్యతలను అప్పగించారు. పాత వారికి ఉద్వాసన పలికారు. వారు సైతం నియోజకవర్గాల వారీగా చేసే అభివృద్ధి పనులపై నివేదికలు తయారు చేశారు. అయితే వారి నివేదికలు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. అయితే కొత్తవారు ఆ నివేదికలతోనే అభివృద్ధి పనులు చేపడతారా? లేకుంటే మళ్లీ వివరాలు సేకరించి నివేదికలు అందజేస్తారా? అనేది చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం సైతం నివేదికలు అందజేయాలని ఇన్ చార్జీ మంత్రులకు సూచించినట్లు తెలిసింది. వారి నివేదిక ఆధారంగానే పనులను బట్టి బడ్జెట్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం.

కాంగ్రెస్ మార్క్..
ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. ఏయే గ్రామాల్లో అత్యవసరంగా ఉన్న పనులకు తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం కంటే అభివృద్ధి పనులు చేపట్టాలని, కాంగ్రెస్ మార్క్ చూపాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రతి మండలానికి రెండు చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1440 గ్రామపంచాయతీ భవనాలను, 1440 అంగన్వాడీ భవనాలను ఈ ఏడాది నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించారు. హమ్ విధానంతో మొత్తం 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను ఆధునీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ప్రతిశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇక గ్రామాలు ప్రగతి బాట పట్టనున్నాయి.

Read Also- Mega157: చిరు-అనిల్ చిత్రం.. సంక్రాంతి కంటే ముందే రిలీజ్ అవుతుందేమో!

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు