Mega157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా సినిమా ప్రారంభం రోజే చెప్పారు. కానీ, ఆ సినిమా షూటింగ్‌ను అనిల్ రావిపూడి పరుగులు పెట్టిస్తున్న తీరు చూస్తుంటే.. సంక్రాంతి కంటే ముందే థియేటర్లలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే, మాములుగానే అనిల్ రావిపూడి యమా స్పీడ్‌గా షూటింగ్ చేసి, నిర్మాతల ఖర్చును తగ్గిస్తుంటారు. అందులోనూ దర్శకుల పనితీరును మెచ్చి, వారికి వంద శాతం సహకరించే చిరంజీవి వంటి స్టార్ దొరికితే.. ఆయన ఏమేం మ్యాజిక్స్ చేయగలడో అవన్నీ చేస్తున్నారు. అందుకు ఉదాహరణ.. తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేటే.
ఆ అప్డేట్ ఏమిటంటే.. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ ముస్సోరీలో ప్రారంభమైనట్లుగా మేకర్స్ తెలిపారు. నయనతార కూడా రెండు, మూడు రోజుల క్రితమే షూట్‌తో జాయిన్ అయినట్లుగా అధికారిక ప్రకటన కూడా చేశారు. కట్ చేస్తూ.. ముస్సోరీ షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్లుగా గురువారం మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు, టీమ్ అంతా హైదరాబాద్ చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారలపై కీలక సన్నివేశాలు షూట్ చేశారని, ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయని చెబుతున్నారు. అసలు ఎలా ఇలా? అంటూ అనిల్ రావిపూడిపై ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు కొనియాడుతూనే ఉన్నారు. అందుకే అంది.. ఇలా పరుగులు పెట్టిస్తే.. ఏ దీపావళికో ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చేసినా తెచ్చేస్తాడు.. అనిల్ రావిపూడి అంతటి సమర్ధుడే అనేలా కామెంట్స్ పడుతున్నాయి.
Also Read- Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?
కేథరీన్ థ్రెసా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలోనూ స్పెషలిస్టే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రమోషనల్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇటివలే ముస్సోరీ షెడ్యూల్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో అలరించిన విషయం తెలిసిందే. మరి నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడో.. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరో వైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం ఏ స్టేజ్‌లో ఉందో కూడా మేకర్స్ చెప్పడం లేదు. షూటింగ్ సమయంలో కూడా వారేం ఇలా అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో.. ఆ సినిమా కంటే అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమానే ముందు రిలీజ్ అవుతుందనేలా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు