Viraatapalem: PC Meena Reporting
ఎంటర్‌టైన్మెంట్

PC Meena Reporting: ట్రైలర్ అదిరింది.. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సిరీస్ వస్తోంది.. ఓటీటీ ఫ్యాన్స్‌కి పండగే!

PC Meena Reporting: భారతదేశపు టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో జీ5 కూడా ఒకటి. తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem: PC Meena Reporting) అనే ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌కు పోలూరు కృష్ణ (Poluru Krishna) దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై KV శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 27న ZEE5 ఒరిజినల్ సిరీస్‌గా ప్రీమియర్ కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సిరీస్ ట్రైలర్‌ను నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఈ సిరీస్‌పై బీభత్సంగా అంచనాలను పెంచేస్తుంది.

Viratapalem PC Meena Reporting

ట్రైలర్ విడుదల అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వెబ్ సిరీస్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. ‘రెక్కీ’ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు. అభిజ్ఞ, చరణ్ ఇందులో అద్భుతంగా నటించారనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. దివ్య వంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్‌లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ని కూడా టచ్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. జూన్ 27న జీ5లోకి రాబోతోన్న ఈ సిరీస్‌తో ఈ టీమ్‌‌కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Also Read- Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?

‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌ ట్రైలర్ విషయానికి వస్తే.. విరాటపాలెం గ్రామానికి ఓ శాపం ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా సరే.. మరుసటి రోజే పెళ్లి కూతురు చనిపోతుంటుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని శాపం పట్టి పీడిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి ఊరికి ఒక లేడీ కానిస్టేబుల్‌ మీనా (అభి) వస్తుంది. ఆ ఊరి ప్రజల మూఢ నమ్మకాన్ని, ఆ ఊరి రహస్యాల్ని పటా పంచెలు చేయడానికి పెళ్లికి రెడీ అవుతుంది మీనా. ఆ గ్రామ ప్రజలు భయపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పోలీస్ కానిస్టేబుల్ మీనా నిజాల్ని ఊరి ప్రజలకు తెలిసేలా చేసిందా? లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా అంచనాలు పెంచేసేదిగా ఉంది.

Also Read- Famous Temple: మెగాస్టార్ ధ్యానం చేసిన ఆలయం.. అమరావతికి దగ్గరలోనే!

ఈ సిరీస్‌లో ఉన్న వాతావరణం గమనిస్తే.. 80వ దశకానికి చెందినట్టుగా కనిపిస్తోంది. నటీనటుల కట్టూ బొట్టూ, మాట తీరు, విజువల్స్ అన్నీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తున్నాయి. మ్యూజిక్, విజువల్స్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నాయనేది ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఎటువంటి వల్గారిటీ లేని ఈ సిరీస్‌ను కుటుంబ సమేతంగా చూడొచ్చని జీ5 టీమ్ ప్రకటించింది. చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించిన ఈ సిరీస్‌కు దివ్య తేజస్వి పెరా కథను, విక్రమ్ కుమార్ కండిమల్ల స్క్రీన్‌ప్లేని అందించారు. రోహిత్ కుమార్ నేపథ్య సంగీతం, మహేష్ కె స్వరూప్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు. జూన్ 27 నుంచి ZEE5లో ఈ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ప్రీమియర్‌ కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు