Minister Seethakka: పేదరిక నిర్మూలనే లక్ష్యం..
Minister Seethakka(image credit: swetcha reporter)
Telangana News

Minister Seethakka: పేదరిక నిర్మూలనే లక్ష్యం.. ఆరు వేల కుటుంబాలకు సహాయం!

Minister Seethakka: పేదరిక నిర్మూలన లక్ష్యంగా (Telangana) తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. సచివాలయంలో తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 6 వేల కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అభాగ్యులు, నిర్భాగ్యులకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, ప్రభుత్వం తరపున ఆయా కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు.

 Also Read: MLA Veerlapalli Shankar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

ఆదిమ జాతులు అంతరించిపోతున్నాయి

అత్యంత వెనుకబడిన కుటుంబాలను, వర్గాలను ఆర్థిక పథంలో నిలిపే విధంగా ఈ కార్యక్రమం కృషి చేస్తుందని మంత్రి నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) సహకారంతో రెండేళ్ల పాటు ఆయా కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీతక్క  (Seethakka) తెలిపారు. ఆదిమ జాతులు అంతరించిపోతున్నాయని, వాటి పరిరక్షణ కోసం బ్రాక్ సంస్థతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఆదిమ జాతుల ఆర్థిక ప్రగతిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. సమగ్ర ఉపాధి అవకాశాల ద్వారా పేదల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి సుస్థిరాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడనుందన్నారు. మొదటి విడతలో పీవీటీజీలు, గిరిజనులు, జోగినీలు, ఇతర బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు చేయూతనివ్వడం జరుగుతుందన్నారు.

గుర్తించిన మండలాలు..
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట(Narayanpet) జిల్లాలోని నర్వ మండలం, ములుగులోని తాడ్వాయి, కన్నాయిగూడెం, (Kannayigodem) నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని అమ్రాబాద్, పద్రా, వికారాబాద్ జిల్లాలోని కోడంగల్, కేబీ ఆసిఫాబాద్‌లోని తిర్యాణి, లింగాపూర్ మండలాలను గుర్తించారు. ఆయా మండలాల్లో గుర్తించిన 6 వేల కుటుంబాలకు రెండేళ్ల కాలంలో రూ.30 కోట్ల నిధులను నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ స్మృతి శరణ్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, బ్రాక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

 Also Read: GHMC: శరణార్థుల సర్టిఫికెట్లపై.. నివేదిక కోరిన కేంద్రం!

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!