Farmer Welfare Initiatives( image credit: swetcha reporter)
తెలంగాణ

Farmer Welfare Initiatives: రైతుల సంక్షేమంపై.. తెలంగాణ ప్రభుత్వం భేష్!

Farmer Welfare Initiatives: పంజాబ్ రైతుల విషయంలో సుప్రీంకోర్టు గతంలో వేసిన హై పవర్ కమిటీ, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నదని, రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కొనియాడింది. హర్యానా రాష్ట్రంలోని పంచకుల నగరంలో ప్రభుత్వ వ్యవసాయ కార్యాలయంలో హై పవర్ కమిటీతో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి,( Kodanda Reddy)  సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, (Anvesh Reddy) విత్తన చట్టం కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హై పవర్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని రైతుల (Farmers) సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రధాన పంటలపై సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ పథకాలపై ప్రశంసలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రాయితీలతో కూడిన వ్యవసాయ పనిముట్లు వంటి పథకాలపై తెలంగాణ బృందం హై పవర్ కమిటీకి వివరించింది. దీనిపై హై పవర్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి (Revanth Reddy)  రేవంత్ రెడ్డిని అభినందించింది. ఇతర రాష్ట్రాల్లో (Farmers) రైతుల సమస్యలు, అక్కడి పాలసీల కంటే  (Telangana) తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని హై పవర్ కమిటీ అభిప్రాయపడింది.

 Also Read: KTR Responds to ACB Notice: ఏసీబీ నోటీసుపై కేటీఆర్ లేఖ.. సుప్రీం కోర్టు ఇదే చెప్పిందని వెల్లడి!

విత్తన చట్టంపై చర్చ..
అదేవిధంగా, ములుగు విత్తనోత్పత్తి ఘటనపై కూడా హై పవర్ కమిటీ ఆరా తీసింది. ములుగులో జరిగిన అంశాన్ని, మల్టీనేషనల్ విత్తన కంపెనీల మోసాలపై హై పవర్ కమిటీ దృష్టికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) తీసుకెళ్లారు. సమగ్రమైన విత్తన చట్టంతోనే విత్తన కంపెనీలను కట్టడి చేయవచ్చని, విత్తనోత్పత్తి చేసే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. విత్తన చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా హై పవర్ కమిటీకి తెలంగాణ బృందం వివరించింది. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని, విత్తన చట్టం కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, కేంద్రం అడ్డుకునే విధానం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బృందం (Telangana team) చేసిన విలువైన సూచనలను హై పవర్ కమిటీ నోట్ చేసుకుందని, మరిన్ని సలహాలు, సూచనలు ఉంటే సీల్డ్ కవర్‌లో రాసి పంపాలని హై పవర్ కమిటీ చెప్పినట్లు కోదండరెడ్డి (Kodanda Reddy) తెలిపారు. హై పవర్ కమిటీ ఆహ్వానం మేరకే హర్యానాకు వచ్చినట్లు ఆయన వివరించారు.

హరిపూర్ గ్రామంలో పర్యటన..
అనంతరం తెలంగాణ బృందం హరిపూర్ గ్రామంలో పర్యటించి అక్కడి రైతులతో సమావేశమైంది. హర్యానాలో వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, విత్తన చట్టం అమలు తీరు, రైతాంగం కోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై రైతులతో చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను వారికి వివరించారు.

సమావేశంలో ప్రముఖులు..
హై పవర్ కమిటీ సమావేశంలో హై పవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ నవాబ్ సింగ్, కమిటీ సభ్యులు దేవేందర్ శర్మ, డా. సూక్పాల్ సింగ్, ప్రొఫెసర్ గుమన్, హై పవర్ మెంబర్ సెక్రటరీ డా. అమిత్ అగర్వాల్ పాల్గొన్నారు. తెలంగాణ బృందం నుంచి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు కమిషన్ సలహాదారులు రామాంజనేయులు, డా. దొంతి నర్సింహా రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు శివ ప్రసాద్, హరి వేంకట ప్రసాద్, అలాగే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 Also Read: Hyderabad District Collector: అంగన్‌వాడీ కేంద్రాల్లో.. కలెక్టర్ తనిఖీ!

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ