Rythu Bharosa: రైతు భరోసా (Rythu Bharosa) నిధులు4 ఎకరాల రైతులకు (farmers) జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,313.53 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని, ఇప్పటి వరకు మొత్తం రూ.5,215.26 కోట్లు రైతు భరోసా కోసం విడుదల చేసి, 58.04 మంది రైతులకు (farmers) సాయం అందించినట్టు వివరించారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి 9 (Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా (Rythu Bharosa సహాయాన్ని అందజేస్తున్నామన్నారు.
Also Read: Water Diversion: బనకచర్లను అడ్డుకోవాలని.. కేంద్రానికి లేఖలు!
రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ (BRS) నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల వ్యాఖ్యానించారు. గతంలో (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా, వానాకాలం రైతు బంధు సహాయం ఎప్పుడూ సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని, ప్రతిసారి ఆలస్యంగానే రైతుల ఖాతాలలోకి జమ చేశారని, అదికూడా 10వ నెల వరకు కొనసాగేదన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా 3 రోజుల్లోనే రూ.5 వేల కోట్లకు పైగా రైతు బంధు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ రైతులకు (farmers) ఇచ్చిన మాట ప్రకారం దేశానికే ఆదర్శంగా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ పథకాన్ని పూర్తిచేసి చూపించామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 5 వేల నుండి 6 వేలకు పెట్టుబడి సహాయాన్ని పెంచి, రైతులకు (farmers) అందచేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగికి సంబంధించిన రైతుబంధు నిధులను ఇవ్వకుండా గత ప్రభుత్వం వదిలేస్తే, తాము అధికారంలోకి రాగానే వాటిని కూడా చెల్లించామని గుర్తు చేశారు. రైతుల (farmers) సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 77,000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
Also Read: Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!