YS Jagan: అవును.. టైటిల్ చూడగానే ఇదేం లాజిక్కు రా బాబూ? అని అనుకుంటున్నారు కదూ.. అవునండోయ్ మీరు వింటున్నది అక్షరాలా నిజమే. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun) చూడటానికి వచ్చి, తద్వారా జరిగిన తొక్కిసలాటతో ఒకరు మృతి చెందడం, మరొకరు కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడిన పరిస్థితుల్లో.. రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బన్నీని అరెస్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఇదే సీన్ ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూడా జరిగింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) చూడటానికి తండోప తండాలుగా జనం వచ్చారు. అయితే.. ఈ పర్యటనలో పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. ఉదయం పర్యటన మొదలుకుని సాయంత్రం వరకూ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరి అటు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఏపీ ప్రభుత్వం కూడా అంతకుమించే చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. ఇంతకీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈ ఘోరాలకు వైఎస్ జగన్‌ను బాధ్యుడిని చేస్తుందా? లేదా..? చాన్నాళ్ల తర్వాత వచ్చిన సువర్ణావకాశాన్ని సీఎం చంద్రబాబు వినియోగించుకుంటారా? లేదా..? పెద్ద డౌటానుమానమే..!
Read Also- Venu Swamy: మరో బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. అదే జరిగితే మొత్తం నాశనమే?
ఇంత దారుణమా?
బుధవారం నాడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో (YS Jagan Palnadu Tour) అడుగడుగునా అపశృతులు చోటుచేసుకున్న పరిస్థితి. ఇవాళ ఉదయం ఏటుకూరు బైపాస్ వద్ద ఒకరు మృతి చెందారు. మరోవైపు.. సత్తెనపల్లిలో మరొకరు మృతి చెందారు. సత్తెనపల్లి ఐలాండ్ సెంటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉన్న వ్యక్తిని హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ లోపే ఆ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఇక మరికొన్ని చోట్ల తొక్కిసలాట, ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి కానీ, అక్కడేమీ ప్రాణ నష్టం జరగపోవడం ఊపిరి పీల్చుకునే విషయమని చెప్పుకోవచ్చు. అందుకే అక్కడ అల్లు అర్జున్ రాకతో ఒకరు మృతి చెందడంతోనే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడేమో ఇద్దరు వ్యక్తుల చావుకు కారణమైన జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? రూల్ అందరికీ ఒక్కటే కదా? అనే విషయాన్ని వైసీపీ ప్రత్యర్థులు, సామాన్య ప్రజలు, నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఎందుకంటే పల్నాడు ఎస్పీ ముందుగానే 100 మందికి మంచి పర్యటనలో పాల్గొనడానికి వీల్లేదని తేల్చి చెప్పినన్పటికీ.. ఇలా జనాలను పోగేయడం, ఉద్రిక్త.. తొక్కిసలాటకు కారణం కావడంతో జగన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఇక కష్టమే మామ!
వైఎస్ జగన్ ప్యాలెస్ నుంచి బయటికి వస్తున్నారంటే చాలు.. ‘ అన్నొస్తున్నాడు.. మామయ్య వస్తున్నాడు.. చేయి చేయి కలుపుదాం.. జగనన్న కోసం కష్టపడదాం.. పల్నాడులో జగనన్న రూలింగ్..’ ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని స్లోగన్స్, అంతకుమించి ప్లకార్డులు దర్శనమిస్తున్న పరిస్థితి. అయితే జగన్ పర్యటనల్లో ఇప్పటి వరకూ ఏమీ జరగకపోవడంతో సేఫ్.. ఇప్పుడు ఇంత దారుణ ఘటనలు జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది వైసీపీ వర్గాలే ఊహించలేకపోతున్నాయి. బహుశా.. పల్నాడు జిల్లా పర్యటన ముగిశాక తాడేపల్లి, యలహంక ప్యాలెస్‌లు బయటికి రాడేమో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నో వివాదాలు, అంతకుమించి అడ్డంకులు, ఆరోపణల నడుమ రెంటపాళ్ల పర్యటన సాగడం.. అందులోనూ వరుస అపశృతులు చోటుచేసుకోవడంతో బహుశా రేపొద్దున్న జగన్ ఎక్కడికి వెళ్లాలన్నా.. ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి. ఒకట్రెండు రోజుల్లో ఈ మరణాలకు జగన్‌ను బాధ్యుడ్ని చేసి అరెస్ట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం గట్టిగానే జరుగుతున్నది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా టీడీపీ గట్టిగానే ఖండిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న పరిస్థితి. మనుషులు ప్రాణాలు తీసి, ఆ శవాలను దాటుకుని ఊరేగింపులా? ఇదేమి ఉన్మాదం? అంటూ నెటిజన్లు సైతం దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలతో వైసీపీ అధిపతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. ఇంత సడన్‌గా ఎందుకిలా?