Minister Ponnam Prabhakar( image credit: swetcha reporter)
తెలంగాణ

Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!

Minister Ponnam Prabhakar: ఆషాఢ (Ashadha Bonalu) మాసంలో భక్తుల నుంచి ఘనంగా బోనాలు అందుకునే అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం దక్కిందని  (Hyderabad) హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆషాఢ బోనాల ఉత్సవాలతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులందరూ సేవా భావనతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

గోల్కొండ కోట ఆవరణలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, విద్యుత్, దేవాదాయ, వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, (GHMC) అగ్నిమాపక, టూరిజం, సమాచార శాఖ అధికారులతో జగదాంబ మహంకాళి దేవస్థానంలో బోనాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 Also Read: Ponnam Prabhakar: రవాణా శాఖలో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచాలి!

సమన్వయంతో పని చేయాలి..
ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న అమ్మవారికి సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. అధికారులు సేవాభావంతో సమన్వయంతో పని చేయాలని, భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు, టాయిలెట్లు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, జీహెచ్‌ఎంసీ (GHMC) శానిటేషన్‌ను పర్యవేక్షించాలని సూచించారు.

రూ. 20 కోట్లు కేటాయింపు..

(Bonalu Festival) బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ. 20 కోట్ల నిధులు కేటాయించారని మంత్రి వివరించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఇప్పటికే బోనాల ఉత్సవాలపై  (Bonalu Festival) సమీక్ష నిర్వహించామని, ప్రముఖ దేవాలయాలకు ప్రముఖులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అమ్మ దయవల్ల తెలంగాణలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, మంచి వ్యాపారాలతో అంతా మంచి జరగాలని వేడుకుందామని మంత్రి సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు తొలి బోనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రపంచ సాంకేతికత పెరిగినా, ఆషాఢ మాస బోనం నెత్తి మీద పెట్టుకొని వస్తున్నామని, గోల్కొండ బోనాలకు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. (Bonalu Festival) బోనాల ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా, ప్రజల సహకారం తప్పక ఉండాలని మంత్రి గుర్తు చేశారు. ఈ సమీక్షలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు కౌసర్ మొహియోద్దీన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్ జీ ముకుంద రెడ్డి, డీసీపీ చంద్రశేఖర్, వివిధ దేవాలయ చైర్మన్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్