Ranga Reddy District(IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

Ranga Reddy District: : రేషన్‌ దుకాణాల్లో (Ration Shops) పేదలకు పంపిణీ చేయాల్సిన గోధుమలు (Wheat Diversion) పక్కదారి పడుతున్నాయి. రాయితీపై ఇచ్చే ఈ గోధుమలను కొంతమంది డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోధుమలను పిండిగా మార్చి బిస్కట్‌ కంపెనీలకు తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి ఇస్తుండగా, ఇదే అదనుగా రేషన్‌ సరుకులను అక్రమ రవాణా చేసి రేషన్‌ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ కార్యాలయంలోని టోల్‌ ఫ్రీ నెంబర్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నట్లు తెలుస్తున్నది.

కొంత మందికే గోధుమలు
రంగారెడ్డి జిల్లాలో (Ranga Reddy District) రేషన్‌ షాపుల (Ration Shops) ద్వారా మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ చురుగ్గా కొనసాగుతున్నది. బియ్యంతోపాటు గోధుమలను సైతం రేషన్‌ దుకాణాల్లో (Ration Shops) పంపిణీ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 కిలోలు, కార్పొరేషన్‌ పరిధిలో 2 కిలోలు, మున్సిపాలిటీల పరిధిలో కిలో చొప్పున ఒక్కో కార్డుపై గోధుమలను ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5.58లక్షల రేషన్‌ కార్డులు ఉండగా, అందులో పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు పైగా రేషన్‌ కార్డులున్నాయి.

మూడు నెలలకు సంబంధించిన కోటాను పొందేందుకు రేషన్‌ కార్డుదారుడు మూడు సార్లు బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుంది. అయితే, చాలామందికి బియ్యంతో పాటు గోధుమలను కిలోకు రూ.7 చొప్పున ఇస్తున్నట్లు తెలియదు. ఇదే రేషన్‌ డీలర్లకు వరంగా మారింది. గోధుమల విషయాన్ని డీలర్లు కార్డుదారులకు చెప్పకపోవడంతో కేవలం బియ్యం మాత్రమే తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది డీలర్లు కొంతమందికే గోధుమలను ఇచ్చి, అయిపోయాయని చెబుతున్నారు. ఇలా నొక్కేసిన గోధుమలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 Also Read: Special Meeting On Banakacherla Project: బనకచర్లపై పీపీపీ.. లోక్‌సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం!

రాజేంద్రనగర్‌ కేంద్రంగా దందా
జిల్లాలోని రాజేంద్రనగర్‌ (Rajendra Nagar) నియోజకవర్గంలోనే ఎక్కువగా గోధుమల దందా నడుస్తున్నది. ఇక్కడ రేషన్‌ బియ్యం ఎలాగో, గోధుమల అక్రమ రవాణా కూడా అదే స్థాయిలో ఉంటున్నది. గతంలోనూ చాలా సందర్బాల్లో గోధుమలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా పట్టుబడ్డాయి. ఈ ప్రాంతంలో బిస్కెట్ల కంపెనీలు ఎక్కువగా ఉండడంతో గోధుమలకు ఉన్న డిమాండ్‌ ఉన్నది. దీంతో అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. గతేడాది పెద్ద ఎత్తున బియ్యంతోపాటు గోధుమలు పట్టుబడ్డాయి.

అత్తాపూర్‌లోని పిల్లర్‌ నెంబర్‌ 162 వద్ద 600క్వింటాళ్ల రేషన్‌ సరుకులు పట్టుబడగా, అందులో 60శాతం బియ్యం ఉండగా, మిగతా 40శాతం గోధుమలే ఉన్నాయి. కిస్మత్‌పూర్‌ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల గోధుమలను పట్టుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో 15క్వింటాళ్ల గోధుమలను,100 క్వింటాళ్ల బియాన్ని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. చౌకధరల దుకాణాలకు పంపిణీ అవుతున్న గోధుమల్లో 60శాతం వరకు లబ్ధిదారులకు అందడం లేదని తెలుస్తున్నది. బ్లాక్‌ మార్కెట్‌లో గోధుమలను రూ.15-20 లెక్కన విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.

టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు
సివిల్‌ సప్లయ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బియ్యంతోపాటు గోధుమల (wheat)అక్రమ రవాణా యథేచ్చగా సాగుతున్నది. రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు సైతం ఉండడం లేదు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ సరుకులను సివిల్‌ సప్లయ్‌ అధికారులు పట్టుకున్న సందర్భాలు సైతం తక్కువే. రేషన్‌ అక్రమాలపై సీసీఎస్ టీం(పౌరసరఫరాల శాఖ బృందాలు) మాత్రమే ఉక్కుపాదం మోపుతున్నది. దీంతో చాలామంది అక్రమాలపై నేరుగా సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌, ల్యాండ్‌ లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తున్నారు. రేషన్‌ డీలర్ల చేతివాటంపై ఇటీవల రాజేంద్ర నగర్‌ ప్రాంతం నుంచి కమిషనర్‌ కార్యాలయానికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లినట్లు తెలిసింది.

తనిఖీలు చేపడతాం
బియ్యంతోపాటు గోధుమల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెడుతాం. రేషన్‌ షాపుల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తాం. రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడినట్లు తెలితే.. కఠిన చర్యలు తీసుకుంటాం.
వనజాత, డీఎస్‌వో, రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)

 Also Read: Mahesh Kumar Goud: కేసీఆర్ కేటీఆర్‌పై.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు