Maruthi and Raja Saab
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab: ‘రాజా సాబ్’ టీజర్ వదిలి తప్పు చేశారా? మారుతి దొరికేశాడు!

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్.. ఆయన సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ప్రభాస్ చేయడానికి ఒక అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నా.. ఒక్క అప్డేట్ కూడా సరిగ్గా రావడం లేదు. ఆ సినిమా సైన్ చేశాడు, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడనే వార్తలే కానీ, ఒక్కటంటే ఒక్క అప్డేట్ రావడం లేదని ఫీలవుతున్న వారందరికీ కరువును తీర్చేశాడు డైరెక్టర్ మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్’ టీజర్‌ని జూన్ 16వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ టీజర్ వదిలి ప్రభాస్ ఫ్యాన్స్‌కి మారుతి చేతినిండా దొరికేశాడంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఆ విషయంలోకి వస్తే..

Also Read- Chaitu and Samanatha: నాగ చైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారా?

‘ది రాజా సాబ్’ టీజర్ వదలడమే కాకుండా, సినిమా రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ మూవీని డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. దీనినే టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో డిసెంబర్‌లో వచ్చే సినిమా కోసం మారుతి అప్పుడే టీజర్ వదిలి.. ఫ్యాన్స్‌కి చేతినిండా దొరికేశాడని నెటిజన్లు కొందరు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘రాధే శ్యామ్’ టైమ్‌లో అభిమానులు అప్డేట్ కోసం నిర్మాణ సంస్థపై ఎలా దాడి చేశారో తెలియంది కాదు. ప్రభాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ. ఆ ఫ్యాన్స్ వేడి చల్లారాలంటే.. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తుండాలి. అప్పుడు మాత్రమే వాళ్లు కూల్‌గా ఉంటారు. లేదంటే మాత్రం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది.

Also Read- SKN: నాన్న అరటిపళ్లు అమ్మిన చోట.. కొడుకు కటౌట్.. ఇంతకంటే ఏం కావాలి?

ఇది దృష్టిలో పెట్టుకునే నెటిజన్లు మారుతి దొరికేశాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే‌ని పురస్కరించుకుని అక్టోబర్‌లో టీజర్‌ని వదిలి, నవంబర్ మధ్యలో ట్రైలర్ వదిలి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఒక నెల తర్వాత నుంచి మళ్లీ అప్డేట్ అప్డేట్ అంటూ మారుతిని కెలికేస్తుంటారు ఫ్యాన్స్. ఆయన్ని నిద్ర కూడా పోనివ్వరు. సో.. ఇంకా 6 నెలలకు పైగా రిలీజ్ ఉండగా.. అప్పుడే టీజర్ వదలి.. ఫ్యాన్స్‌కి చేతినిండా మారుతి దొరికేశాడనేది నెటిజన్ల వాదన. ఏమో.. ట్రైలర్ కంటే ముందు మరో టీజర్ వదిలి.. ప్రభాస్ ఫ్యాన్స్‌ని మారుతి ఖుషి చేస్తాడేమో.. ఎవరికి తెలుసు? ఇప్పుడు టీజర్ వదలడంతో.. ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా ఊపందుకుంటాయి. మారుతి లెక్కలు వేరుగా ఉంటాయి. ఏది ఏమైనా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకు వస్తాడు. ఎందుకంటే, ఆయన కూడా డార్లింగ్‌కి డై హార్డ్ ఫ్యానే. ఇక జూన్ 16న విడుదలైన టీజర్ 24 గంటల్లో 59 మిలియన్ల వ్యూస్ క్రియేట్ చేసి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఈ టీజర్‌ టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్