Minister Seethaka: ప్రతి మండలానికి రెండు చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1440 గ్రామపంచాయతీ భవనాలను, 1440 అంగన్వాడీ భవనాలను ఈ ఏడాది నిర్మిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సచివాలయంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతి, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు, హమ్ విధానంలో రోడ్ల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి, స్త్రీ నిధి, మిషన్ భగీరథ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రజెంటేషన్లు ఆయాశాఖల హెచ్ఓడీలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అత్యంత కీలకమైన శాఖ అన్నారు. 2వేల కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ అని పేర్కొన్నారు.
మల్టీపర్పస్ వర్కర్
ఇంతకు ముందు శాఖలో సెక్రటరీగా పనిచేసిన అధికారులు పదోన్నతులు పొందారని, మన శాఖలో మంత్రి, ఉద్యోగులు వేరు వేరుగా చూడలేదన్నారు. మంత్రి నుంచి మల్టీపర్పస్ వర్కర్ వరకు అందరూ ఒక కుటుంబంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పర్చాలని సూచించారు. సకాలంలో పనులు పూర్తిచేసేలా పనిచేయాలన్నారు. పనులు గానీ ఫైళ్లను కానీ పెండింగ్లో పెట్టకుండా త్వరగా డిస్పోస్ చేయాలని సూచించారు. మెరుగైన సేవలు అందించేందుకు మన శాఖలో ఉద్యోగులంతా కష్టపడుతున్నారని, వారిసమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగ సమస్యలను పరిష్కరించామన్నారు.
Also Read: Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులుండవు.. కిషన్ రెడ్డి
గ్రామ స్వరాజ్యం మన చేతుల్లోనే
93 వేల గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఎంపీడీవోల బదిలీల ఫైలు సీఎం వద్ద ఉందని, ఎంపీడీవోలకు వాహనాల అలవెన్స్ ఫైల్ ఆర్థిక శాఖ వద్దకు చేరిందన్నారు. ఈ రెండు ఫైళ్ళకు కొద్దిరోజుల్లో క్లియరెన్స్ వస్తోందన్నారు. గ్రామ స్వరాజ్యం మన శాఖ చేతుల్లోనే ఉందని, మనమంతా పనులు వేగంగా పూర్తిచేసేలా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం నూతన విధానం తీసుకొచ్చామన్నారు. హామ్ విధానాన్ని అవలంబిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకలకు అధికారుల బృందాలను పంపించాలని ఆదేశించారు. అధ్యయనం చేసి హామ్ విధానాన్నీ తెలంగాణలో పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.
పనుల జాతర సక్సెస్
హమ్ విధానంతో మొత్తం 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను ఆధునికరిస్తామన్నారు. మొదటి విడతలో 7947 కిలోమీటర్లను ఆధునికరిస్తామని, 15 రోజుల్లో టెండర్లు వేసే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉపాధి నిధుల ద్వారా ఇప్పటికే రూ.1800 కోట్ల పనులను మంజూరు చేశామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను ప్రారంభిస్తామన్నారు. గతేడాధి చేపట్టిన పనుల జాతర సక్సెస్ అయ్యిందన్నారు. ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు పల్లెల్లో ఆస్తులను సృష్టించామన్నారు. మహిళల సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా మన శాఖ విశేషంగా కృషి చేస్తుందన్నారు.
Also Read: Viral News: ప్రియుడితో లేచిపోయిన నవ వధువు.. సంతోషంలో భర్త.. ఎందుకంటే?