Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి? అనేదానిపై ఇప్పట్నుంచే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు ఈ మధ్య జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలతో ప్రాధాన్యత సంతరించుకున్నది. దీంతో చాలా రోజుల తర్వాత పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిమానులు, కార్యకర్తలు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏమీ చేయకుండానే ఎందుకిలా హడావుడి అని నిట్టూరుస్తున్నారు కూడా..! ‘ఇంకొందరైతే వారెవ్వా ఏం ప్లాన్ గురూ.. గ్రౌండ్ వర్క్ ఇరదీస్తున్నారుగా..’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు వీరాభిమానులు అయితే ‘వాట్ ఏ విజన్.. ఒక్కొక్కరికీ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయ్’ అంటూ నివ్వెరపోతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు..? ఇదంతా ఎంతవరకూ నిజం? నిజానిజాలెంత..? ఇవన్నీ కాదు ఇప్పుడెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలు ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?
ఓహో.. ఇందుకేనా?
వాస్తవానికి.. జనసేన (Janasena) పార్టీ బలోపేతానికి సేనాని పెద్దగా చర్యలు తీసుకోలేదన్నది జగమెరిగిన సత్యమే. బహుశా దానంతట అదే గ్రౌండ్ లెవల్ నుంచి రాష్ట్రస్థాయి వరకూ బలపడుతుందన్నది పవన్ నమ్మకం కావచ్చేమో! క్యాడర్‌తో పాటు అభిమానులు, సామాజిక వర్గం కూడా తనకు కలిసొస్తుందని.. అదే తనను ఎన్నికల నాటికి బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లుగా ఉన్నారట. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఆశించిన రీతిలో ఫోకస్ పెట్టడం లేదని అభిమానులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు.. రానున్న ఎన్నికల్లోనూ కూటమితోనే కలిసి పోటీ చేస్తున్నామన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. అందుకే.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారట్లుగా తెలిసింది. ఎందుకంటే.. అనవసరంగా ఎక్కువ మందిని నియమించుకోవడం, వారు ఏదో ఒక వివాదంలో చిక్కుకొని పార్టీకి, తనకు చెడ్డపేరు తెస్తారన్న భయం మాత్రం పవన్‌లో క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. అందుకే ఉన్న నేతలతోనే పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిజంగానే బరువు తగ్గారా.. ఎందుకిన్ని డౌట్స్?
ఇదీ అసలు సంగతి..!
ఇదిలా ఉంటే.. ముందుగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే అది కూడా నమ్మకమైన నేతలు, అత్యంత ఆప్తులు, సుదీర్ఘకాలం పార్టీ కష్ట నష్టాల్లో కూడా వెన్నంటి ఉన్నవారిని మాత్రమే ఇన్‌ఛార్జీ పదవులు కట్టబెడుతున్న పరిస్థితి. అంతేకానీ, ఎక్కడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలను నియమించడానికి సేనాని సాహసించట్లేదు. ఎందుకంటే.. ఇలా చేస్తే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ.. నేతలు, కార్యకర్తల మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయని భావిస్తున్నారని తెలియవచ్చింది. అందుకే ఇప్పటి వరకూ చాలా నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జీల జోలికి వెళ్లలేదని తెలియవచ్చింది. ఆ ఇన్‌ఛార్జీల సంగతి అటుంచి.. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారట పవన్. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే జనసేనకు ఎన్ని స్థానాలు తీసుకోవాలి? ఏయే స్థానాలు అయితే బెటర్? అసెంబ్లీ స్థానాల సంగతేంటి? పార్లమెంట్ స్థానాల పరిస్థితేంటి? ఎక్కడ పార్టీ బలంగా ఉంది? ఏయే ప్రాంతాల్లో కలిసొచ్చే సామాజికవర్గం ఉన్నది? అని సర్వే చేయించడానికి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేశారట. అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థకు కాకుండా.. జాతీయ స్థాయిలో ఓ పేరున్న సంస్థ చేత సర్వే చేయించబోతున్నారని సమాచారం. మొదట జనసేనకు బలం ఉన్న 50 నియోజకవర్గాల పేర్లను తెప్పించుకోవాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సర్వే ఫలితాలను బట్టి..!
ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థకు (Survey) ఈ బాధ్యతలను అప్పగించబోతున్నారని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ఆ సంస్థ ఏదనేది ప్రస్తుతానికి బహిర్గతం చేయడానికి సాధ్యం కాదని పార్టీకి చెందిన ఓ కీలక నేత చెప్పారు. సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి రాయలసీమలో (Rayalaseema) ఎన్ని? ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిలాల్లో ఎన్ని స్థానాలు? విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఎన్ని స్థానాలు తీసుకోవాలనే దానిపై సేనాని తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. అందుకే.. ఆ సర్వే వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలు లేకపోతే.. అప్పుడు ఆయా స్థానాల్లో నమ్మకమైన వారిని నియమించడమా? లేకుంటే తనకు దగ్గరగా ఉన్న నేతలకు నియోజకవర్గాలను అప్పగించడమా? అనేది నిర్ణయిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తక్కువలో తక్కువ 50 నుంచి 60 బలమైన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు.. 05 పార్లమెంటు స్థానాల పేర్లను కూడా తనకు సర్వేచేసి ఇవ్వాలని సదరు ప్రముఖ సర్వే సంస్థకు పవన్ కల్యాణ్ బాధ్యత అప్పగించినట్లుగా తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే ఆ సర్వే సంస్థ రంగంలోకి దిగబోతోందని సమాచారం. రానున్న ఎన్నికల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలనే దానిపై ఎంతో పకడ్బందీగా, అంతకుమించి క్లియర్ కట్‌గా పవన్ ఉండబోతున్నారన్న మాట. సో.. దీన్ని బట్టి చూస్తే.. ఇంచుమించు 50 అసెంబ్లీ, 05 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీచేయొచ్చని దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో నిజానిజాలెంత? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Read Also- Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్‌కు బదులిచ్చిన పవన్.. థియేటర్ యాజమాన్యాలపై బిగ్ బాంబ్!