Samantha: నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌లో ఉన్న సమంత (Samantha Ruth Prabhu).. ప్రస్తుతం తన మకాంను ముంబైకి మార్చింది. ముంబైలోనే ఉంటూ అక్కడి యాడ్స్, మూవీస్, వెబ్ సిరీస్‌లలో చేస్తుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో నిర్మాతగా ప్రత్యక్షమై ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. నటిగా కూడా టాలీవుడ్‌లో ఆమె ఇప్పుడో సినిమా చేస్తుంది. చైతూ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత, సమంత కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా ఈ మధ్య వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకులలోని ఒకరితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు రావడమే కాదు, ఆమె కూడా ఆ వార్తలు నిజమే అనేలా ప్రవర్తిస్తూ వస్తుంది. ఎప్పుడు చూసినా సదరు దర్శకుడితోనే ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తుండటం అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇదెలా ఉంటే, తాజాగా ముంబైలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది.
Also Read- Father: తండ్రి ప్రేమ అంటే ఇదే.. పిల్లల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం!
మాములుగా అయితే ఫొటో గ్రాఫర్లను సమంత ఎంకరేజ్ చేస్తుంటుంది. తను పబ్లిక్ ఫిగర్ కాబట్టి.. పబ్లిక్‌లో కనిపిస్తే ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్స్ ఎగబడటం సహజమే. కానీ, ముంబై ఫొటోగ్రాఫర్స్ ఈ మధ్య బాగా అతి చేస్తున్నారంటూ పలువురు సెలబ్రిటీలు వాపోతుండటం విశేషం. రీసెంట్‌గా రానా దగ్గుబాటి బాలీవుడ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనని ఫొటోలు తీయవద్దని అంటున్నా.. ఆగకుండా కొందరు ఫొటోగ్రాఫర్స్ ఎగబడ్డారు. ఆ సమయంలో రానా ఫోన్ చేతిలో నుంచి జారి కింద పడిపోయింది. అలా, ఇబ్బంది పెట్టడంతో రానా అసహనానికి గురయ్యారు. సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కూడా. మా టాలీవుడ్ మీడియా వాళ్లు మాత్రం కచ్చితంగా ఇలా అయితే చేయరు. వారు మాకు ప్రైవసీ ఇస్తారు అనేలా బాలీవుడ్ మీడియాపై రానా అసహనాన్ని వ్యక్తం చేశారు.
Also Read- Puri Sethupathi: కత్తిలాంటి హీరోయిన్‌ని పట్టిన పూరి, చార్మి! ఈసారి హిట్టు పక్కా!
సేమ్ టు సేమ్ ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ మీడియాపై ఫైర్ అయింది. ఆమె వద్దన్నా.. ఫొటో గ్రాఫర్స్ ఎగబడటంతో ‘స్టాప్ ఇట్ గైస్’ అంటూ సీరియస్‌గా వెళ్లిపోయింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన జిమ్ సెషన్ ముగించుకుని బయటకు వచ్చిన సమంతను చూసి.. ఫొటోగ్రాఫర్స్ అతి ప్రదర్శించారు. అసలే టైట్ దుస్తుల్లో ఉన్న సమంత.. దయచేసి ఫొటోలు తీయవద్దని ‘అరె రుకో జీ ప్లీజ్’ అని సున్నితంగా వారించింది. అయినా కూడా వినకుండా వెంటపడి మరీ ఫొటోలు తీయడం స్టార్ట్ చేశారు. ఆ దుస్తుల్లో ఫొటోలివ్వడం ఇష్టం లేని సమంత.. తన కారు కోసం వెతికి, అది కనిపించకపోవడంతో మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. మీడియా వాళ్లను తప్పించుకుంటూ ఆమె వెళుతున్నా.. ఆమె వెంట పడి మరీ ఫొటోలు తీస్తుండటంతో.. ‘స్టాపిట్ గైస్’ అంటూ సీరియస్‌గా చెప్పి.. జిమ్‌కి మరో సైడ్ ఉన్న తన కారు ఎక్కి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Rarely see her get irritated or angry even when disturbed she usually remains cool n composed. That’s a quality we need to inculcate taking from her✨@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/9SMBRoYzxy
— AkaSam (@SammuVerse) June 17, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు