Operation Kagar: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం కొనసాగిస్తున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, రాజకీయ పార్టీల నాయకులు, పౌర హక్కులు, ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పేదరికం, అంతరాలు,అసమానతలు ఉన్నంత కాలం కమ్యూనిజం, మావోయిజం, ఉంటుందని స్పష్టం చేశారు. పాలకులు ఉద్యమకారులను భౌతికంగా నిర్మూలించగలరేమో గానీ, కమ్యూనిజాన్ని, మావోయిజాన్ని అంతం చేయడం ఎవరితరం కాదని వక్తలు ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాలను మరింత ఉదృతం చేయడంతో పాటు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ, శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ జి.హరగోపాల్, కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యకతన నిర్వహించారు. ధర్నాలో 12 వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీఆర్ ఎస్, ఇతర రాజకీయ పార్టీలు, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా, సాంస్కృతిక, ఆదివాసీ, దళిత, తదితర ప్రజా సంఘాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రం తక్షణమే కాల్పుల విమరణ ప్రకటించి, కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని నినదించారు.
Also Read: CM Revanth Reddy: రైతు భరోసా నిధుల విడుదల.. వచ్చే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు!
ప్రధాని, హోంమంత్రి ముద్దాయిలు: ఎమ్మెల్యేకూనంనేని
గోద్రా ఘటనలో ముద్దాయిలు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ అని, ఈ దేశంలోని అణగారిన వర్గాల కోసం సర్వస్వం త్యాగం చేసి ఉద్యమాలు చేస్తున్న వారు మావోయిస్టులు అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే రాజ్యాంగ బద్దంగా చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప భౌతికంగా అంతం చేసే అధికారం మీకు ఎవరీచ్చారని ప్రశ్నించారు. గతంలో ప్యూడల్ వ్యవస్థకు నిజాం నవాబు లాంటి వారు కాపలాగా ఉంటే నేడు ప్యూడల్ వ్యవస్థ కు కొత్త రూపం సంతరించుకున్న కార్పొరేట్ వ్యవస్థకు ప్రధాని మోడీ, అమిత్ షా కాపాలా కుక్కలుగా కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆనాటి బానిసత్వం, వెట్టి, ఉన్న్ల నేడు కూడా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో కోట్లాది మందితో వెట్టి చేయిస్తోందని మండి పడ్డారు. అలాంటి వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు వారి సమస్యలనుపై పోరాట శక్తులను అంతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కమ్యూనిజం అంతం చేయడం నియంతలైన ముసోలీ, హిట్లర్ కాలేదని, ఇప్పుడు అదే సిద్దాంతాన్ని అనుసరిస్తున్న మోడీ, అమిత్ తరంకూడా కాదని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు ఎర్రజెండాలన్ని ఏకం కావాలని మరోసారి ఆకాంక్షించారు. తద్వారా ఎర్రకోటపై అరుణ పతాకం రెపరెపలాడడమే కాకుండా ఈ దేశ ప్రజలను ఆకాంక్ష నేరవేరుతుందన్నారు.
Also Read: Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం పై మంత్రి పొన్నం సమీక్ష
మావోల శవాలను చూసిన పాలకులకు భయమే: డాక్టర్ కె.నారాయణ
మావోయిస్టులను చూడడం కాదు.. వారి శవాలను చూస్తేనే భయపడే పిరికి పందలు ఈ పాలకులనిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. మావోయిస్టుల ముక్త్ భారత్ కాదు.. త్వరలోనే అమిత్ షా ముక్త్ భారత్ ఉద్యమాలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. పక్క దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలతో అక్కడ పాలకులకు ఏ గతి పట్టిందో కేంద్ర పాలకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ దేశంలో నియంత పాలనకు చరమ గీతం పాందుకు వామపక్షాలు, ప్రగతీశీల శక్తులు ఏకతాటిపైకి వచ్చిన మహాత్తరమైప ఉద్యమ ఎత్తుగడలతో సమరశీల పోరాటాలకు శ్రీకారం చూట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
మావోయిస్టులు, ఉగ్రవాదులు వేరని, ఏ జెండా లేని ఉగ్రవాదులతో కేంద్రం చర్చలకు సిద్దమైనప్పడు రాజకీయ ఎజెండా ఉన్నా మావోయిస్టులతో చర్చించడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.అంతకు ముందు మావోయిస్టులను అణిచివేసే పేరుతో 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో ఆదివాసులతో పాటు మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తల హత్యకాండను కొనసాగిస్తూ గత 17 నెలల్లో దాదాపు 540 మందిని చంపివేశారని హత్యకాండను వెంటనే ఆపాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు రామచందర్, ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ (ఎం-ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ రాజా, తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్ వెన్నల గద్దర్, అరుణోదయ నాయకురాలు విమలక్క, అంబటి నాగయ్య, వినాయక రెడ్డి, బెల్లం నగేష్ మాట్లాడారు.
Also Read: Uttam Kumar Reddy: పోలవరం మార్పులను తిరస్కరించండి.. మంత్రి డిమాండ్!