Kuppam Incident: మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు
Kuppam Incident
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Kuppam Incident: సీఎం ఇలాకాలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు

Kuppam Incident: ఆంధ్రప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. కుప్పం మున్సిపాలిటీ (Kuppam Muncipality) పరిధిలోని నారాయణ పురం (Narayanapuram)లో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంగా మహిళను తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైతం స్పందించారు.

వివరాల్లోకి వెళ్తే..
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప (Timmarayappa), శిరీష (Sireesha) భార్య భర్తలు. గ్రామానికి చెందిన మునికృష్ణప్ప (Muni Krishnappa) దగ్గర భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుభారం పెరిగిపోవడంతో భార్య, బిడ్డలను వదిలేసి తిమ్మరాయప్ప ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో భార్య సైతం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను చెట్టుకు కట్టేసి
అయితే పిల్లాడి స్టడీ సర్టిఫికేట్ కోసం శిరీష.. తిరిగి గ్రామానికి వచ్చింది. అయితే అప్పు తీర్చకుండా వెళ్లిపోయారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న మునికృష్ణప్ప, అతని కుటుంబం.. శిరీషను చూడగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమెపై దాడి చేయడమే కాకుండా తాడుతో చెట్టుకు కట్టేశారు. అప్పుతీర్చాలంటూ గంటపాటు వేధింపులకు గురిచేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శిరీషను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మునికృష్ణప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Baba Vanga Prediction: ముంచుకొస్తున్న ముప్పు.. ఆ రోజున ఏం జరగబోతోంది.. నెట్టింట ఒకటే చర్చ!

సీఎం చంద్రబాబు ఆగ్రహం
తన నియోజక వర్గంలో జరిగిన దారుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిందితుడు మునికృష్ణప్పను అరెస్ట్ చేసినట్లు సీఎంకు ఎస్పీ తెలిపారు. మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా అధికారులకు సీఎం సూచించారు.

Also Read This: Israel attack on Iran: వార్తలు చదువుతుండగా క్షిపణి దాడి.. ప్రాణ భయంతో పరిగెత్తిన యాంకర్!

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి