Uttam Kumar Reddy( image credit: twitter)
తెలంగాణ

Uttam Kumar Reddy: పోలవరం మార్పులను తిరస్కరించండి.. మంత్రి డిమాండ్!

Uttam Kumar Reddy: పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించిన టీఓఆర్ మార్పులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు  ఆయన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు (Bhupendra Yadav) బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో పాటు ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని, ఇది పక్క రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల విస్తరణకు పాల్పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు.

గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్, సాంకేతిక సలహా మండలి సూచనలకు విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) కేంద్ర పర్యావరణ శాఖ నుంచి 2005 అక్టోబర్ 25న అనుమతి లభించినప్పటికీ, కాలక్రమేణా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఎటువంటి అనుమతులు లేకుండానే భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గుర్తుచేశారు. ఈ విషయమై 2011 ఫిబ్రవరి 8న కేంద్రం పనులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ ఉత్తర్వులను 2026 జులై 2 వరకు పొడిగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.

 Also ReadCM Revanth Reddy: రైతు భరోసా నిధుల విడుదల.. వచ్చే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు!

ఈ అంశంపై తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ పనులు కొనసాగడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ, ప్రాథమికంగా ఆమోదించిన భాగాలకు మాత్రమే నిధుల రీఎంబర్స్‌మెంట్ కొనసాగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పేర్కొన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి భారీ మార్పులను చేపట్టిందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రాజెక్టు విస్తరణపై 2022 సెప్టెంబర్ 6న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రాజెక్టు విస్తరణకు సాంకేతిక నివేదికలు అవసరమవుతాయని పేర్కొన్న విషయాన్ని, పర్యావరణ అనుమతులు అవసరం ఉన్నాయన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఎంఓఈఎఫ్./సీసీ అన్ని పక్షాలతో సమావేశం కావాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట ఆమోదించిన ప్రమాణాల ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం (Central Government) పాల్పడుతుందని ఆరోపించారు.

డిజైన్ మార్పులపై తీవ్ర అభ్యంతరం..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా, కుడి కాలువ హెడ్ స్లూయిస్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం నుంచి 40 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పెంచుతూ డిజైన్‌లో మార్పులు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. వాస్తవానికి రెండు టన్నెల్‌లు కూడా 20 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు. పైగా హెడ్ వర్క్స్ కు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే నిర్మించబడ్డాయన్నారు. పీఐపీఆర్‌ఎంసీ 11,654 క్యూసెక్కులకు డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్‌లో ఆమోదించినప్పటికీ 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతోందన్నారు. పోలవరం ఎడమ కెనాల్‌ను కూడా అంతే సామర్థ్యంతో నిర్మిస్తున్నారని, ఆమోదం పొందిన సామర్థ్యం కేవలం 8,123 క్యూసెక్కులేనని, అందుకు భిన్నంగా ప్రాజెక్టు డిజైన్ మార్చి ఎటువంటి అనుమతులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయన్నారు.

కేంద్ర మంత్రికి విజ్ఞప్తి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ పరిగణనలోకి తీసుకోవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఇటువంటి ప్రతిపాదనలను ఈఏసీ సమావేశంలో తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

 Also Read: KTR: ప్రజల్లో చర్చిద్దామంటే రేవంత్ పారిపోయాడు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!