rohit vemula
Top Stories, క్రైమ్

Caste Politics: రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణాలు ఇవేనంటా!.. కేసు క్లోజ్.. ‘చచ్చినా వదలని కులం’

Rohit Vemula: 2016లో సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికింది. దేశంలోని ఇతర జాతీయ యూనివర్సిటీల్లోనూ ఆందోళనలు వచ్చాయి. రోహిత్ వేములకు సంఘీభావం లభించింది. అంబేద్కర్ చిత్రాన్ని పట్టుకుని నిరసనలు చేసిన రోహిత్ వేముల అందరినీ షాక్‌కు గురిచేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. నా పుట్టుక ఒక ప్రాణాంతక ప్రమాదం వంటి అగ్నిగోళాల వంటి మాటలను తన సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఆత్మహత్య తర్వాత దళిత సమాజం తీవ్ర ఆగ్రహావేశానికి లోనైంది. రోహిత్ వేములది ఆత్మహత్య కాదు.. కచ్చితంగా వ్యవస్థీకృత హత్యే అని దళిత మేధావులు వాదించారు. 2016లో జరిగిన ఈ ఘటన పై దర్యాప్తు నత్తనడకన సాగింది. చివరికి సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు కేసు క్లోజ్ చేయడానికి పోలీసులు డిసైడ్ అయ్యారు. అదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాకైనా ఈ అంశం మళ్లీ ముందుకు వచ్చింది. రోహిత్ వేములకు న్యాయం జరగాలని చేసిన ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థుల విద్యా హక్కు, ఆత్మగౌరవాన్ని కాపాడేలా రోహిత్ వేముల పేరు మీదుగా చట్టాన్ని తెస్తామని రాహుల్ ప్రకటించారు. ఇటీవల ఆయన నిర్వహించిన భారత్ జోడో యాత్రలోనూ పాల్గొనడానికి రోహిత్ తల్లి రాధిక వేములను ఆహ్వానించారు.

సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌కు చెందిన స్కాలర్ రోహిత్ వేముల మరణానికి సంబంధించి గచ్చిబౌలీ పోలీసులు క్లోజర్ రిపోర్ట్‌ను ఫైల్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు అప్పుడు వీసీగా ఉన్న ప్రొఫెసర్ అప్పారావు, అప్పటి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు, ఏబీవీపీ నేతలు, స్మృతి ఇరానీలకు విముక్తి కల్పిస్తూ క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు.

ఈ కేసు ఆత్మహత్యకు పురికొల్పిన ఆరోపణలతో నమోదైంది. సెక్షన్ 306 ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని కూడా జోడించారు. కానీ, ఈ క్లోజర్ రిపోర్టులో ఆయన మరణానికి గల కారణాల కంటే కూడా ఆయన కులానికి సంబంధించిన చర్చ ఎక్కువ ఉన్నది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆధారాలు ఏవీ లభించలేదని, ఆయన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని రిపోర్టు స్పష్టం చేసింది.

Also Read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. నామినేషన్ దాఖలు

రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయన కులం బయటపడుతుందన్న భయం కారణం అని రిపోర్టు పేర్కొంది. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కాదనే విషయం బయటపడుతుందని రోహిత్ వేముల దిగులుపడ్డాడని, అది బయటపడితే తన అకడమిక్స్ మొత్తం నష్టపోవడమే కాకుండా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడి ఉంటాడని అనుమానించింది. తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడను కాదని రోహిత్‌కు తెలుసు అని, తన తల్లి ఈ ఎస్సీ సర్టిఫికేట్‌ను సంపాదించిందనే విషయమూ ఆయనకు తెలుసు అని పేర్కొంది. రాధిక వేముల తాను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మహిళను అని తరుచూ స్పష్టం చేసుకుందని, ఓబీసీలోని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఇంటిలో పని చేశానని వివరించిన విషయం తెలిసిందే. రోహిత్ తండ్రి మణి కుమార్‌ కూడా వడ్డెర కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. దళిత అని తెలిసిన తర్వాత రాధికను, కొడుకు రోహిత్‌ను మణి కుమార్ వదిలిపెట్టాడు.

రోహిత్‌కు సొంత సమస్యలు ఉన్నాయని, ప్రాపంచిక వ్యవహారాలతో ఆయన సంతోషంగా ఉండేవాడు కాదని క్లోజర్ రిపోర్టు పేర్కొంది. తద్వార విద్యార్థుల ఆరోపించిన, కేసు పెట్టిన అప్పటి వీసీ అప్పారావు, బీజేపీ నాయకులను నిర్దోషులుగా ఈ రిపోర్టు తెలిపింది. తన స్టడీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ వేములను.. ఆయన చదువు కంటే క్యాంపస్‌లోని విద్యార్థి రాజకీయాల్లో ఎక్కువగా కలుగజేసుకునేవాడని బ్లేమ్ చేసింది.

ఒక వేళ యూనివర్సిటీ నిర్ణయాలపై ఆగ్రహం ఉంటే వాటిపై రోహిత రాసి ఉండేవాడు లేదా కనీసం సూచనప్రాయంగానైనా వెల్లడించేవాడని, కానీ, అలాంటిదేమీ ఆయన చేయలేదని రిపోర్టు పేర్కొంది. కాబట్టి, అప్పటి యూనివర్సిటీలోని పరిస్థితులు రోహిత్ వేముల మరణానికి కారణాలని చెప్పలేమని తెలిపింది. వాస్తవానికి ఆయన క్యాంపస్‌లో దళిత విద్యార్థులను ఎలా ట్రీట్
చేస్తున్నారో వివరిస్తూ వ్యంగ్యంగా ఓ ఉత్తరాన్ని అప్పారావుకు రాసి ఉన్నాడు.

Also Read: బీఆర్ఎస్‌కు మరో దెబ్బ.. ఈ సారి ఎమ్మెల్సీ ఔట్

అంబేద్కర్ సూత్రాలపై సమసమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఈ క్లోజర్ రిపోర్టుపై ఓ ట్వీట్ చేసింది. ‘ఇది క్లోజర్ రిపోర్టు కాదు, రోహిత్ వేముల క్యారెక్టర్ అసాసినేషన్. ఎంట్రెన్స్‌ను ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేసిన బ్రిలియంట్ స్టూడెంట్ రోహిత్. ఇలా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఏకైక విద్యార్థి రోహిత్
వేములనే. ఈ వ్యవస్థకు బాధితుడైన రోహిత్ వేములకు న్యాయం జరగాల్సింది పోయి ఆయనకు ఈ వ్యవస్థ చేస్తున్నది ఇదీ. కులం ఒకరు మరణించిన తర్వాత కూడా వదలదు’ అని పేర్కొంది.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు