– గులాబీకి దూరం అవుతున్న ఎమ్మెల్యేలు
– ఈ సారి ఎమ్మెల్సీ కూడా ఔట్
– ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు
– హైకోర్టు తీర్పు
BRS MLC: బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికారం కోల్పోయక గులాబీ పార్టీకి ఎమ్మెల్యేలు దూరం అవుతున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు ఇది వరకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా పార్టీకి ఎమ్మెల్యేల రూపంలోనే కాదు.. తాజాగా ఎమ్మెల్సీ రూపంలోనూ షాక్ తగిలింది. ఏకంగా హైకోర్టే ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదేని తేల్చేసింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారwణ జరిపిన హైకోర్టు దండె విఠల్ ఎన్నిక చెల్లదని తేల్చింది. దండె విఠల్‌కు రూ. 50 వేల జరిమానా విధించింది.
దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. 2021లో ఈ ఎన్నిక జరిగింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలోకి దిగారు. కానీ, బీఆర్ఎస్ ప్రకటించిన ఈ అభ్యర్థితో అప్పుడు అదే గులాబీ పార్టీలో ఉన్న పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి విభేదించారు. తాను స్వతంత్రంగా పోటీ చేయడానికి నిర్ణయించారు. నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పేరుతో నామినేషన్ ఉపసంహరణకు దరఖాస్తు వచ్చిందని ఆ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి విత్ డ్రా చేశారు. కానీ, నిజానికి తాను నామినేషన్ ఉపసంహరణకు దరఖాస్తు ఇవ్వలేదని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆ తర్వాత వాపోయారు. తన సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్‌ను ఉపసంహరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతోనే హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ.. నామినేషన్ దాఖలు
ఈ పిటిషన్‌పై హైకోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్నది. నామినేషన్ ఉపసంహరణకు చేసిన దరఖాస్తులోని సంతకం పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిది కాదని తేల్చింది. దీంతో ఆ ఎన్నిక చెల్లదని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండె విఠల్, మరో స్వతంత్ర అభ్యర్థి పెందూరి పుష్ఫరాణి పోటీ పడ్డారు. ఆదిలాబాద్‌లో మొత్తం ఓట్లు 860 ఉండగా.. అందులో విఠల్‌కు 742 ఓట్లు వచ్చాయి. పుష్పరాణి కేవలం 75 ఓట్లకే పరిమితం అయ్యారు. కాగా, నామినేషన్ ఉపసంహరించడంతో రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయలేకపోయారు.